చిరంజీవి ‘ఇంద్ర’ స్టెప్ పవన్ కళ్యాణ్ వేస్తే..!

chiranjeevi veena step in pawan-kalyan-sardaar gabbar singhఊహించుకోవడానికే కాస్త కష్టసాధ్యంగా ఉంది కదూ! ఎందుకంటే తెలుగు సినిమాలకు సరికొత్త డ్యాన్స్ లను పరిచయం చేసిన ఘనత ఒకరిది అయితే, అసలు డ్యాన్స్ అంటే ఇష్టం ఉండదని, ఈ విషయంలో అభిమానులు తనను మన్నించాలని బహిరంగంగా చెప్పిన ఘనత మరొకరిది. అయితే అలాంటి దాన్ని అభిమానుల కోసం సుసాధ్యం చేయనున్నాడని ఫిల్మ్ వర్గాల టాక్.

ADVERTISEMENT

‘ఇంద్ర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ వయసులోనూ మెగాస్టార్ వేసిన స్టెప్ పట్ల సర్వత్రా ప్రశంసలు లభించాయి. మరి అలాంటి స్టెప్ ను పవన్ ఎందుకు వేస్తాడు… అంటే… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో వచ్చే ఒక ఎపిసోడ్ లో పవన్ స్టెప్పులు వేసి ఏ స్టెప్పు ఎవరిదో చెప్పాలని ఖైదీలను కోరతారట.

అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పాటకు గానూ ‘ఇంద్ర’ సినిమాను ఎంపిక చేసుకుని, వీణ స్టెప్ ను వేసినట్లుగా తెలుస్తోంది. దీని కోసం దాదాపుగా మూడు, నాలుగు రోజులు ప్రాక్టీస్ కూడా చేసారట పవన్. అయితే మెగాస్టార్ మాదిరే ఈ స్టెప్ ను పవన్ కూడా ఇరగదీసారని టాక్. మరి వెండితెరపై దీన్ని వీక్షిస్తే… అభిమానులకు కన్నుల పండుగే కదూ! మరొక మాసం వేచియుంటే ఆ కల సాకారం అవుతుంది మరి!

ADVERTISEMENT
Latest Stories