Telugu

ఇబ్బందుల్లో పడ్డ చిరు ‘ఖైదీ నెంబర్ 150?’

ఆగష్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేయాలని భావిస్తున్న ఫస్ట్ లుక్ కోసం చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తోందని సమాచారం. ముఖ్యంగా టైటిల్ విషయంలో అభిమానుల మదిలో ఉన్న సందేహాలను ఈ పోస్టర్ తో నివృత్తి చేయాలని మెగా క్యాంపు తర్జనభర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు అనుకున్న “కత్తిలాంటోడు” టైటిల్ పై అభిమానులు అనాశక్తిని ప్రదర్శించడంతో, అది కాస్త వెనక్కి వెళ్లి “ఖైదీ నెంబర్ 150” ముందుకొచ్చింది.

ADVERTISEMENT

అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ “ఖైదీ నెంబర్ 150” టైటిల్ కూడా ఇబ్బందుల్లో పడిందని, తాజాగా ‘నెపోలియన్’ గానీ, ‘లెనిన్’ అన్న టైటిల్స్ ని పరిశీలన చేస్తున్నారన్న టాక్ ఊపందుకుంది. ఓ పక్కన ఇలా టైటిల్స్ పై చర్చ జరుగుతున్న తరుణంలోనే… మెగా అభిమాని ఒకరు ‘నెపోలియన్’ టైటిల్ తో కంటికి ఇంపైన విధంగా ఒక పోస్టర్ సృష్టించి సోషల్ మీడియాలో వదిలాడు. దీంతో మెగాస్టార్ 150వ సినిమా టైటిల్ ‘నెపోలియన్’గా ప్రచారం జరుగుతోంది.

దీనిపై నివృత్తి జరగాలంటే… అధికారికంగా ఆగష్టు 22వ తేదీ వరకు వేచిచూడాలేమో! లేదంటే ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ తేజ్ స్వయంగా ప్రకటిస్తారేమో చూడాలి. గతంలో మెగాస్టార్ చిరంజీవి ‘కత్తి’ రీమేక్ లో నటిస్తున్నారన్న వార్తను కూడా చెర్రీనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టైటిల్ కూడా చెర్రీ ద్వారానే అధికారికంగా బయటకు రావచ్చన్నది ట్రేడ్ వర్గాల భోగట్టా.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

SCOOP: Fauzi’s New Date to Repeat Dil Raju-Mythri War?

Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…

54 minutes ago

Ram Pothineni’s RAPO23 Completes Second Schedule

Ram Pothineni is working on his first film as a writer-director, #RAPO23. He is also…

1 hour ago