ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న హాలీవుడ్ మూవీ ఓపెన్ హెయిమర్ కోసం భారతీయ ప్రేక్షకులు అల్లాడిపోతున్నారు. ముంబైలోని ఒక పివిఆర్ మల్టీప్లెక్స్ లో రిక్లైనర్ సీట్ 2450 రూపాయలు పెడితే క్షణాల్లో సోల్డ్ అవుట్ అయిపోయింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మీదున్న క్రేజ్ కి ఇది చిన్న శాంపిల్ మాత్రమే.
ఓపెన్ హెయిమర్ 3 గంటల 10 నిముషాలు సాగే సుదీర్ఘమైన డ్రామా. ఎలాంటి గ్రాఫిక్స్ ఉండవు. క్లైమాక్స్ లో వచ్చే ఆటం బాంబు పేలుడు కూడా నోలన్ నిజంగానే సృష్టించాడు. పాత్రల మధ్య చాలా సేపు సంబాషణలే ఉంటాయి. అలా అని మన సౌలభ్యం కోసం తెలుగులో డబ్బింగ్ చేశారా అంటే లేదు. ఇంగ్లీష్ తో పాటు కేవలం హిందీకి మాత్రమే అనువాదం చేయడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు.
నోలన్ గతంలో తీసిన డార్క్ నైట్, డార్క్ నైట్ రైజెస్, ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్ లకు ఇండియాలో భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే వీటికి హైదరాబాద్ లో స్పెషల్ షోలు వేస్తే అన్నీ ఫుల్ అయ్యాయి. అందుకే ఓపెన్ హెయిమర్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే నిశ్చయంతో ఉన్నారు. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, మమ్మీ లాంటి ఎన్నో సిరీస్ లను తలదన్నే ఫాలోయింగ్ నోలన్ సొంతం.
ఈ పరిణామాల నుంచి గమనించాల్సిన అంశం ఒకటుంది. ఒకప్పుడు మన దేశంలో పరిమితంగా ఉన్న ఇంగ్లీష్ సినిమాల మార్కెట్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. దాని ప్రభావం నేరుగా మన రిలీజుల మీద పడుతోంది. ఉదాహరణకు అదే రోజు వస్తున్న హిడింబ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, హత్యలు కనీస బుకింగ్స్ కోసం కిందా మీద పడుతుంటే ఓపెన్ హెయిమర్ టికెట్లు దొరకడం లేదు.
భవిష్యత్తులో ఇది మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. గ్రాండియర్లకు అలవాటు పడిన ఆడియెన్స్ ఆ విజువల్ ఎక్స్ పీరియన్స్ కోసం హాలీవుడ్ మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. దాదాపు అన్నీ తెలుగు డబ్బింగ్ తో వస్తున్నాయి. మిషన్ ఇంపాజిబుల్ 7 మన దేశం వరకు టామ్ క్రూజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ముప్పై ఏళ్ళ క్రితం జురాసిక్ పార్క్ తో కేవలం ఏ సెంటర్ల నుంచి మొదలైన ఈ సునామి ఇప్పుడు చిన్న చిన్న కేంద్రాలకు పాకిపోయింది. క్లాసు మాసు తేడా లేకుండా అందరికీ చేరిపోయిన ఈ ట్రెండ్ ని కాచుకోవా.



