
అల్లు అర్జున్ కేసు ఇంకా సాగుతూనే ఉంది. దాని గురించి అందరికీ తెలుసు. కనుక ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోనక్కరలేదు. వందల కోట్లు పెట్టి తీసే సినిమాలకు మొదటి పది రోజుల కలెక్షన్స్ చాలా కీలకం. కానీ ఇకపై వాటిని అనుమతించబోమని సిఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో నిర్మాతలు, డిస్ట్రబ్యూటర్లు షాక్ అయ్యారు.
అయితే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎగ్జిబిటర్స్ (సినిమా థియేటర్ల యజమానులు) సంతోషంగా స్వాగతిస్తున్నారు. ఎందువల్ల అంటే ప్రివిలేజ్ షో, అదనపు చార్జీల సొమ్ము మొత్తం డిస్ట్రిబ్యూటర్లకే పోతుంది కనుక.
డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతలు, అలాగే థియేటర్ల యజమానుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల ముందే డబ్బు వసూలు చేసుకుంటారు. కనుక వారికి ఎటువంటి నష్టమూ ఉండదు. కానీ టికెట్ ఛార్జీలు విపరీతంగా పెంచడం వలన థియేటర్లకు ప్రేక్షకులు తగ్గితే ఆ మేరకు థియేటర్ల యజమానులే నష్టపోతారు.
మరో కారణం ఏమిటంటే, సామాన్య, మద్యతరగతి ప్రజలు ఖరీదైన మల్టీ ప్లెక్స్ థియేటర్ల కంటే తక్కువ టికెట్ ఛార్జీలు గల సింగిల్ స్క్రీన్ థియేటర్లకే ఎక్కువ మొగ్గు చూపుతారు. కానీ టికెట్ ఛార్జీలు పెంచేస్తే ఆ థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడరు.
సినిమాలు రిలీజ్ అయిన కొత్తలో వెంటనే చూసేయాలనే తపన, ఉత్సాహం 10-15 రోజులు పోతే ఉండదు. అప్పటికి సినిమా గురించి టాక్ వచ్చేస్తుంది. కనుక సినిమా ఏమాత్రం యావరేజ్ అని తెలిసినా ఈ మాత్రం దానికి అంత డబ్బు పెట్టి థియేటర్లోనే చూడాలా?మరో 15 రోజులు ఆగితే ఎలాగూ ఓటీటీలోకి వచ్చేస్తుందిగా? అని అనుకుని ఆగిపోయేవారు కోకొల్లలు.
అదే.. టికెట్స్ రేట్స్ పెంచకుండా ఉంటే సామాన్య, మద్యతరగతి ప్రజలు తప్పకుండా థియేటర్లో సినిమా చూసేందుకు ప్రయత్నిస్తారని థియేటర్ల యజమానులు ఎప్పటి నుంచో చెపుతున్నారు. కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు ఇప్పుడు అల్లు అర్జున్ కేసుతో తెలంగాణ ప్రభుత్వమే తమ సమస్యలని పరిష్కరించిందని థియేటర్ల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే పెద్ద హీరోలు, దర్శకుల పెద్ద సినిమాల కారణంగా దెబ్బై పోతున్న చిన్న సినిమాల నిర్మాతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్ల కబ్జాని ప్రభుత్వం అడ్డుకొని తమ సినిమాల ప్రదర్శించుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…