సీజేపీ: ప్రతిసారి డెడ్ లైన్ అంటే…?

నీట్ పేపర్ లీకేజ్ తో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగిన నిరసన కార్యక్రమాలు, వాటితో మారిన రాజకీయ పరిస్థితులతో కాక్రోచ్ జనతా పార్టీ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. పేపర్ లీకేజ్ తో నీట్ విద్యార్థులకు మద్దతుగా సీజేపీ చేపట్టిన ఉద్యమం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది, అలాగే వారి మద్దతును సంపాధించుకుంది.

పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టిన సీజేపీ నేతలు అందుకు కేంద్రానికి, మోడీ సర్కార్ కి ఒక డెడ్ లైన్ కూడా విధించింది. అయితే సీజేపీ నిరసనలకు జెన్ జీ ల మద్దతు తోడవడంతో ఇక చేసేదేమి లేక మూడుసార్లు వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చి, హ్యాట్రిక్ ప్రధాని గా చరిత్ర సృష్టించిన మోడీ కేవలం ఒక సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన పార్టీ డిమాండ్ కి తలవొగ్గాల్సి వచ్చింది.

ADVERTISEMENT

దీనితో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే తమ నిరశన కార్యక్రమాలతో, తమ డెడ్ లైన్ లతో కేంద్ర మంత్రిని సైతం రాజీనామా చేయించిన పార్టీగా సీజేపీ దేశ ప్రజల అటెన్షన్ తీసుకుంది.

అయితే ఇప్పుడు కూడా సీజేపీ మరో డెడ్ లైన్ తో ముందుకొచ్చింది. గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా జరగుతున్న సర్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, బీజేపీ కి వ్యతిరేరకంగా ఉన్న ఓటర్ల జాబితా గల్లంతు అవుతుందంటూ బీజేపీ ప్రత్యర్థి పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.వారికీ మద్దతుగా నేడు సీజేపీ కూడా తెరముందుకొచ్చింది.

కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ఈ డిమాండ్ కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలోకి సీజేపీ ఎంట్రీ ఇవ్వడం, అందుకు 48 గంటల డెడ్ లైన్ విధించడంతో ఈ టాపిక్ ఇప్పుడు ఎటువంటి రాజకీయ మలుపులకు కారణం కాబోతుంది అన్న చర్చ మొదలయ్యింది.

సర్ పై జాతీయ మీడియాలో ప్రచారమైన కథనాలతో మీడియా ముందుకొచ్చిన సీజేపీ ప్రతినిధులు ప్రధాన ఎన్నికల కమిషనర్ (ఈసీ) జ్ఞానేశ కుమార్ రాజీనామా డిమాండ్ ను తెరమీదకు తెచ్చారు. 48 గంటలలో జ్ఞానేశ రాజీనామా చేయకుంటే జంతర్ మంతర్ 2.0 తప్పదు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

జ్ఞానేశ రాజీనామాతో పాటుగా ఆయన పై క్రిమినల్ కేసు పెట్టాలని అలాగే సర్ ప్రక్రియను నిలిపివేసి 2025 నాటి ఓటర్ల జాబితానే ఎన్నికల కోసం పరిగణలోకి తీసుకోవాలని, ఇక సర్ కి సంబంధించిన ఫైళ్ళన్ని కూడా సుప్రీం కోర్ట్ నియమించిన కమిటీ ఆధీనంలోనే ఉంచాలనే మూడు ప్రధాన డిమాండ్లను సీజేపీ ముందుపెట్టింది.

అయితే నాడు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సీజేపీ విధించిన డెడ్ లైన్ కు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిందని, ఇప్పుడు కూడా అదే మాదిరి మోడీ సర్కార్ దిగి వస్తుందని, రావాలని రాజకీయ అంశాల మీద కూడా సీజేపీ ఈ రకమైన డెడ్ లైన్ లు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది.

ప్రతి దానికి ఇలా డెడ్ లైన్ లు పెట్టుకుంటూ పొతే సీజేపీ డిమాండ్లు కూడా రాజకీయ స్వార్ధం కోసం మొదలైన అవకాశాలుగానే పరిగణించబడతాయి. అలాగే కాంగ్రెస్ మొదలుపెట్టిన వివాదంలోకి సీజేపీ ఎంట్రీ ఇచ్చి దాన్ని ఉద్యమాల రూపంలోకి మార్చి దేశంలో ఎదో జరుగుతుంది అనే భావన తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది అనే భావన కలుగుతుంది.

జంతర్ మంతర్ లో నాడు జరిగిన ఉద్యమం వెనుక అనేక సంఘ విద్రోక శక్తులు కూడా పాగా వేసాయి అన్న సంగతి ఉద్యమ అనంతరం జరిగిన విచారణలో తేటతెల్లమయ్యింది. ఇక ఇప్పుడు కేజేపీ జంతర్ మంతర్ 2.0 అంటూ మరో రాజీనామా కోసం డెడ్ లైన్ పెట్టి, నిరసనలకు దిగితే దేశ రాజధాని ఢిల్లీ నిరశన అడ్డాగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రతిసారి సీజేపీ ఇలా డెడ్ లైన్ అంటూ ప్రభుత్వాలను బెదిరిస్తూ పోతే ఆ పదానికున్న బలం కూడా రానురాను పలుచబడిపోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నిన్న కరువు – నేడు వరద..ప్రకృతితో రాజకీయమా.?

ప్రకృతిని సైతం రాజకీయాలలోకి లాగుతూ వాటి పై కూడా రాజకీయ విమర్శలు చేసేందుకు వెనుకాడడం లేదు కొన్ని రాజకీయ పార్టీలు,…

17 minutes ago

Shaque: Trust No One Review: A Toothless, Dull Missing-Child Thriller

BOTTOM LINE A Toothless, Dull Missing-Child Thriller PLATFORM NETFLIX RUNTIME 4Hrs 25Mins [7 Episodes] What…

41 minutes ago