Telugu

జ్ఞానేష్ రాజీనామా: ఇరు పక్షాలకు అంతిమ పోరాటమే!

కేంద్ర ఎన్నికల కమీషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్‌లు మరో పోరాటం మొదలుపెట్టాయి. ‘సర్’ పేరుతో ఎన్నికల జాబితాలలో లక్షలాది ఓటర్ల తొలగింపుకు ఆయనే పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాక్రోచ్‌ల వాదిస్తున్నాయి.

ఇదివరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే “తొలి విజయం సాధించామని, అయితే ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. ఇంకా చాలా వికెట్లు పడతాయి చూస్తూ ఉండండి,” అని అన్నారు.

ADVERTISEMENT

కనుక ఇది కేవలం ‘సర్’ అవకతవకలను సరిచేసేందుకే చేస్తున్న పోరాటం కాదని, ‘సర్ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా’ పేరుతో మోడీ ప్రభుత్వంపై బిజేపి వ్యతిరేక శక్తుల ప్రతినిధిగా సీజేపీ చేస్తున్న రాజకీయ పోరాటమని భావించవచ్చు.

సీజేపీ వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నందునే ఈ స్థాయిలో ఇంత ఉదృతంగా చేయగలుగుతోంది. ఢిల్లీ లేదా ముంబాయి వంటి మహా నగరాలలో గట్టిగా రెండు మూడు రోజులు దీక్షలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అలాంటిది సుమారు నెలరోజుల పాటు చేయాలంటే?

ఒక చోట అన్ని వేలమంది ఆందోళన చేయాలంటే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎవరు కల్పిస్తున్నారు? ఎందుకు?అని ఆలోచిస్తే కాక్రోచ్‌ల వెనుక మోడీ, బిజేపి వ్యతిరేక శక్తులు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఆ ధైర్యంతోనే అతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత కూడా రాజీనామా చేయిస్తామని చెప్పగలుగుతున్నారనుకోవచ్చు.

ఈవిధంగా సీజేపీని ముందు పెట్టి ఆందోళనలు చేయిస్తూ ఒక్కొక్కరి చేత రాజీనామాలు చేయిస్తూ, ప్రభుత్వాన్ని బలహీనపరుస్తూ, చేతికి మట్టి అంటకుండా అంతిమంగా ప్రధాని మోడీని, బిజేపిని రాజకీయంగా దెబ్బ తీయాలనుకోవడం అద్భుతమైన వ్యూహమే కావచ్చు.

కానీ నేడు మోడీ ప్రభుత్వానికి జరుగుతున్నది, రేపు కాంగ్రెస్‌ లేదా మరో పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడూ ఇలాగే జరగకుండా ఉంటుందా?

ఇప్పటికే యుద్ధాలు, ఎల్‌నినో ఇంకా పలు కారాణాల వలన దేశంలో ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ధృడంగా నిలకడగా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని మనమే బలహీనపరిచి, మనమే కూల్చేసుకుంటే అప్పుడు దేశం పరిస్థితి ఇంకా మెరుగుపడుతుందా? లేక ఇంకా దిగజారిపోతుందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న కాక్రోచ్‌లు, వాటి వెనుకున్న రాజకీయ పార్టీలు ఆలోచించకపోవచ్చు.

కానీ వారి ఆందోళనలకు సంఘీభావం ప్రకటించే దేశ ప్రజలు తప్పక ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రధాని మోడీ లేదా అయన ప్రభుత్వమో కాదు.. దేశ ప్రజలే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

ఇక జ్ఞానేష్ కుమార్‌ చేత కూడా రాజీనామా చేయించగలిగితే, ఇక సీజేపికి దాని వెనుకున్న రాజకీయ శక్తులకు తిరుగు ఉండదు. ఇదేవిధంగా ముందుకు సాగుతూ అంతిమంగా మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాయి.

ఈ విషయం మోడీ ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. కనుక ఇక్కడితో దీనిని ఏదో విధంగా ఫుల్ స్టాప్ పెట్టక తప్పదు. కనుక సర్ జ్ఞానేష్ కుమార్‌’ పేరుతో మొదలైన ఈ పోరాటం రెండు వర్గాలకు అంతిమ పోరాటమనే భావించవచ్చు.

అంతే కాదు… ఇది దేశ భవిష్యత్‌ని నిర్దేశించే అంతిమ పోరాటంగా కూడా భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Salman’s Maatrubhumi Finally Escapes Limbo

Salman Khan’s long-delayed war drama Maatrubhumi: May War Rest In Peace is finally showing signs…

2 minutes ago

Lokesh’s Ambitious Call On India, But Work Needed!

Andhra Pradesh has been making significant progress in terms of financial power and irrigation projects…

22 minutes ago