
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలస్‌కి కూతవేటు దూరంలోనే అమరావతి రైతులు నాలుగేళ్ళపాటు ఆందోళన దీక్షలు చేసినా పట్టించుకోలేదు. తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొని కూతురు చికిత్సకు సాయం చేయమని అడిగేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు కాకినాడ నుంచి వచ్చిన ఆరుద్ర అనే మహిళకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా, వైసీపి నేతల వేధింపులు భరించలేక హైదరాబాద్ పారిపోయే పరిస్థితి కల్పించారు. సొంత తల్లి, చెల్లి, బాబాయ్, ఆయన కుమార్తె సునీత రెడ్డికి జగన్ ఎటువంటి ట్రీట్‌మెంట్ ఇచ్చారో అందరికీ తెలుసు. మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్‌మెంట్ లభించేది కాదు.
కానీ జగన్‌కు పూర్తి భిన్నంగా సిఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తుంటారని అందరికీ తెలుసు. ఇందుకు తాజా ఉదాహరణగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ ట్విట్టర్‌లో చిన్న మెసేజ్ పెడితే సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
ఆమె సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత గురించి కొన్ని సూచనలు చేయాలనుకున్నారు. అయితే వివిద మార్గాలద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని కనుక సోషల్ మీడియా ద్వారా ఓ 10 నిమిషాలు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని ఆమె అభ్యర్ధించారు.
దానికి సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ, “పర్వాలేదు సునీతగారు. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మనం తప్పకుండా భేటీ అవుదాము. నా టీమ్ మీతో మాట్లాడుతుంది. మా ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండేవిదంగా అవసరమైన చర్యలు చేపడుతున్నాము. మన సమావేశం ద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోగలమని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…