
తెలంగాణ రాష్టంలో ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ ‘కేంద్రబిందువుగా’ మారింది. మొన్నీమధ్య తమ పార్టీ ప్రచారానికి వెళ్లిన హరీష్ రావు ఈసారి గట్టా తెలంగాణలో కేసీఆర్ గాన అధికారంలో రాకుంటే హైద్రాబాద్ పరిస్థితి ఆంధ్రాలో ఉన్న అమరావతి లెక్క కావాల్సిందే అంటూ వ్యంగ్యంగా ఏపీ రాజధాని దుస్థితిని అక్కడి ప్రజలకు వివరించారు.
అంతే కాదు గతంలో తెలంగాణాలో పది ఎకరాలు అమ్మి ఆంధ్రాలో ఒక ఎకరం కొనాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆంధ్రాలో పదెకరాల అమ్మితే తెలంగాణలో ఒక ఎకరం కొనే స్థితికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం అంటూ హరీష్ రావు ఏపీ దీన స్థితిని వివరించారు.ఇప్పుడు తాజాగా ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీ రాష్ట్రాన్నే ఉదాహరణగా చూపించి తమ పార్టీకి ఓటువేయాలని అడుగుతున్నారు.
మనం ఎవరితో విడిపోయామో వారి బోడెర్ లోనే మీరున్నారు. అక్కడ రోడ్లు ఎట్టున్నాయో ఓసారి చుడండ్రి దాని బట్టి మాకు ఓటువేయండి. “డబుల్ రోడ్ వస్తే తెలంగాణ, అదే సింగల్ రోడ్ వస్తే ఆంధ్రా” అంటూ ఆంధ్రప్రదేశ్ దుస్థితిని తెలంగాణ ప్రజలకే కాదు ఆంధ్రా ప్రజలకు, పాలకులకు కూడా తెలియచేసారు కేసీఆర్.ఆంధ్రా నుండి విడిపోతే తెలంగాణ చీకటవుతుందని ఓపెద్దమనిషి చెప్పిండు కానీ ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయి అంటూ జగన్ అండ్ కో కు కళ్లు తెరిపించారు.
అయితే ఇప్పుడు ఏపీకి ఈ దుస్థితి రావడానికి కూడా ఓరకంగా ఈ పెద్దలే కారణంగా చెపుతారు. ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం ఇన్ని విమర్శలు చేసిన ఈ నేతలే రేపటిరోజున మళ్ళీ ఇదే ప్రభుత్వ పెద్దలకు సహకారం అందిస్తారనుకోండి.మొన్నీ ఈ మధ్య ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వైసీపీ ఆస్థానవిద్వాంసుడు ప్రశాంత్ కిషోర్ కూడా సంక్షేమ పథకాల అమలులో ఏపీని ఆదర్శంగా తీసుకుంటే ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవ్వరు బాగుచేయలేని దుస్థితికి వెళ్ళిపోతుందని చెప్పుకొచ్చారు.
అయితే జగన్ గెలుపుకి సహకరించిన ఇద్దరు వ్యక్తులు జగన్ ప్రభుత్వ విధానాలను తప్పుపడ్డం జగన్ కు డబల్ ధమాఖానా లేక ఈ ఇద్దరు కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలకు అందించడం ఏపీ ప్రజలకు డబల్ దమఖానా అనేది తేలాల్సి ఉంది.వచ్చే ఎన్నికల ఫలితాలే ఈ వ్యంగ్యాస్త్రాలకు సమాధానాలు కావాలని ఆశిద్దాం.ఇక్కడి ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకి పంపే ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఏపీ పై చేస్తున్న విమర్శలకు, ఈ రాష్టానికి జరుగుతున్న అవమానానికి ఎలా బదులిస్తారో చూడాల్సి ఉంది.
Ranabaali First Half: It takes time to get used to VD in this role, and…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…