బాబుకి జగనే ఆదర్శం..!

Jagan Chandrababu Naiduరాజకీయాలలో ఒక్కోసారి అనుభవం.., వయస్సు నేర్పని పాఠాలు ప్రత్యర్ధులు నేర్పుతారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎదుర్కుంటున్న పరిస్థితులు కూడా ప్రత్యర్థి పార్టీ నేర్పిన అనుభవంలో భాగమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర అభివృద్ధికి కాకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులను జైళ్లకు పంపడానికి, రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడానికి, తమ ప్రత్యర్థుల పై పగ సాధించడానికి ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో బాబు ఖచ్చితంగా జగన్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిందే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

ADVERTISEMENT

తమని, తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అది తమ సొంత పార్టీ నేతలైనా ఉపేక్షించేది లేదని ఆర్ఆర్ఆర్ విషయంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ నిరూపించారు. ఇదే వైఖరి
ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో బాబు అనుసరించి వుంటే బూతులమంత్రిగా పేరుపొందిన కొడాలి నాని, ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్న రోజా పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలని టీడీపీ శ్రేణులు ఆయా నేతలకు హితవు పలుకుతున్నారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు సెక్యూరిటీ ఇచ్చిమరీ రాష్ట్రం మొత్తం పాదయత్రకి సహకరించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి కక్ష్య పూరిత రాజకీయాలకు తెగపడితే ప్రస్తుతానికి పైశాచిక ఆనందం పొందవచ్చు కానీ.. ‘బండ్లు ఓడలవుతాయి’ అన్న తీరుగా అధికార పక్షం విపక్షమైతే.? ఆయా నేతల పరిస్థితి ఏమిటో కాలమే బదులివ్వాలి.

రాజకీయాలలో నేతలకు ఎకిలితనం కాదు హుందాతనం ఉండాలి. తప్పు చేస్తే శిక్షలు వేయడాన్ని ఎవరు తప్పు పట్టరు. అంతేకాని శిక్షలు వేయాలి కదా అని తప్పులు చేయడమే ఇక్కడ ప్రశ్నార్థకమవుతుంది. అర్ధమవుతుందా రాజా..! ఇప్పటికైనా బాబు గారు ఈఒక్క విషయంలో జగన్ ను ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories