Telugu

జగన్ అనుకున్నదే జరుగుతుందిగా!

జగన్ అధికారం అందిపుచ్చుకున్న నాటినుండి తాను ఎంచుకున్న పంధాలోనే ముందుకెళ్తున్నారు. అయితే అది రాష్ట్రాభివృద్ధికి దోహదపడితే అందరు హర్షించేవారు. అలాకాకుండా ఆ నిర్ణయాలు రాష్ట్ర విధ్వంసానికి పురిగొల్పుతుంటే మాత్రం రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి పౌరుడు స్పందించాల్సిందే.

ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తేవాలి? అభివృద్ధి ఎలా చేయాలి? సకాలంలో ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలి? యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి? తాగు – సాగునీటి అవసరాలను ఎలా తీర్చాలి? రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎలా అందుబాటులో ఉంచాలి? కొత్త నిర్మాణాల రూపకల్పన ఎక్కడ చేయాలి? రోడ్ల పునరుద్ధరణ.,విద్యార్థులకు నాణ్యమైన విద్య., అందరికి అందుబాటులో వైద్యం ఎలా తీసుకురావాలి అనే కనీస సదుపాయాల మీద దృష్ఠి పెడుతుంది.

ADVERTISEMENT

అందరి ముఖ్యమంత్రుల మాదిరి ఆలోచిస్తే తన మార్క్ రాజకీయం ప్రజలకు గుర్తుండదనే భావనలో జగన్ ఉన్నారేమో అన్నట్లు ఆయన నిర్ణయాలు ఉంటాయి. కట్టడాలతో మొదలెట్టాల్సిన పాలన కూల్చివేతలతో మొదలయింది. ఆకలి తీర్చాల్సిన ప్రభుత్వాలు ఇసుక పాలసీని రద్దుచేసి ఆకలి చావులకు సాక్ష్యంగా నిలిచింది. ఉపాధి అవకాశాలు అందించాల్సిన ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వ అధికారంతో లిక్కర్ వ్యాపారం చేస్తూ ఎంతోమంది ఉపాధిని లాక్కుంది. కొత్త నిర్మాణాల మాట అటుంచితే గత ప్రభుత్వంలో నిర్మించిన రాజధానిని కళ్ళ ముందే కాలరాసింది.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ప్రశ్నించిన ప్రతిసారి జగన్ ఎంచుకున్న విధానం డైవర్షన్ పొలటిక్స్ .ఒకరకంగా జగన్ అందులో మాస్టర్ డిగ్రీ పొందారని చెప్పాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అడిగితే ప్రభుత్వ భవనాలు కూల్చడం..,అమరావతి రైతులకు న్యాయం చేయమంటే భూములిచ్చిన రైతుల మీద లాఠీ చార్జీలు చేయించడం., రోడ్ల నిర్మాణాలు చేపట్ట మంటే రాజధాని రోడ్లను తవ్వేయడం.., అమరావతి నిర్మాణాల గురించి ప్రశ్నిస్తే తన నేతలను బాబు ఇంటి పైకి పంపి రచ్చ చేయడం… ఇలా మరెన్నో!

ప్రజా సమస్యలు చర్చించాల్సిన సభలో ప్రతిపక్ష నేతల భార్యలను కించపరిచి పైశాచిక ఆనందం పొందడం,విపక్ష నేతలను వ్యక్తిత్వ హననం చేయడం, వయస్సుకి – అనుభవానికి కూడా మర్యాద లేకుండా బూతులు తిట్టడం – తిట్టించడం జగన్ తాలూకా రాజకీయం. రాజధాని ఎక్కడ అంటే..చంద్రబాబు వెదవ, పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే.. లోకేష్ పప్పు, ప్రత్యేక హోదా రాదా అంటే.. పవన్ మూడు పెళ్లిళ్లు, జగన్ ఇసుక మాఫియా చేస్తున్నాడు అంటే.. పవన్ ఒక ప్యాకేజీ కుక్క అనడం, వైసీపీ కల్తీ లిక్కర్ అమ్ముతుంది అంటే పట్టాభి జగన్ ను బూతులు తిట్టాడు అంటూ టీడీపీ ఆఫీస్ ను తగలపెట్టడం..వైసీపీ తాలూకా బ్రాండ్.

రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను విపక్షాలు ఎత్త్తిచూపిన ప్రతిసారి కుల ఘర్షణలు – విగ్రహాల ధ్వంసానికి పాల్పడి మత విద్వేషాలు రెచ్చగొడుతూ డైవర్షన్ పొలటిక్స్ లో జగన్ ఉత్తీర్ణత సాధించారు. వచ్చే ఆరు నెలలు ఎన్నికల సమయం ప్రశ్నించే అన్ని వేళ్ళు ప్రభుత్వం వైపే సమాధానం కోసం చూస్తాయి. విపక్ష నేతల మూకుమ్మడి విమర్శలను తిప్పుకొట్టడం.., ప్రజలలో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను నియంత్రించడం.,గోడలు దూకడానికి సిద్ధంగా ఉన్న నాయకులకు చెక్ పెట్టడం అన్ని ఒకే ఒక్క పనితో ముగించారు జగన్ అదే చంద్రబాబు అరెస్ట్.

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఏకైక సమస్య చంద్రబాబు అరెస్ట్. ప్రతి మీడియాలో అదే చర్చ.., ప్రతి పత్రికలో అదే వార్త.., ప్రతి సామజిక మాధ్యమాలలో అదే రచ్చ. ఎస్..జగన్ కు కావాల్సింది అదే. రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. విపక్ష నేతల యాత్రలకు బ్రేకులు వేశారు, ప్రతిపక్షాల విమర్శలను పక్క దారి పట్టించారు, ప్రజా దృష్టిని మరల్చారు. ఒక్క దెబ్బకు రెండు కాదు చాలా పిట్టలనే కొట్టారు జగన్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth-Vidya Balan Flirting: What Was Nelson Thinking?

Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…

29 minutes ago

Pics: Vaani Brings A Bold Edge To Ethnic Elegance

Vaani Kapoor brings a rich, moody twist to festive dressing in this striking navy and…

49 minutes ago