
విశాఖకు కాగ్నిజెంట్ వచ్చేసింది. ఒప్పందం ప్రకారం ముందుగా తాత్కాలిక భవనంలో 8,000 మందితో కార్యకలాపాలు మొదలుపెడుతోంది. విశాఖలో కాగ్నిజెంట్‌తో సహా మరో 8 కంపెనీలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భూమిపూజ కూడా చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి ప్రసంగిస్తూ, మంత్రి నారా లోకేష్ తమ కంపెనీని విశాఖకు ఏ విధంగా తీసుకొచ్చారో చెప్పారు. ఆయన చెప్పింది వింటే, ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించడానికి మంత్రి నారా లోకేష్ ఎంత పట్టుదలగా పని చేస్తున్నారో అర్థమవుతుంది.
కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి ఏం చెప్పారంటే, “2025 దావోస్ సదస్సు జరిగే సమయంలో ఉదయం 7 గంటలకు నారా లోకేష్ మాతో సమావేశమయ్యారు. అప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీలు. ఆయన సమావేశం ఫిక్స్ చేశారు కనుక వెళ్లి కలిశాము.
విశాఖలో కాగ్నిజెంట్ పెట్టాల్సిందేనన్నారు. అలాగే కాస్త ఆలోచించుకుని చెప్తామన్నాము. కానీ ఇక్కడే కూర్చుని ఆలోచించుకోమని చెప్పి ఆయన కూడా కూర్చుండిపోయారు. దాంతో ఏం చేయాలో తెలియక మా సీఈవో రవి కుమార్, నేను నారా లోకేష్‌ను రాజకీయ స్థిరత్వం, విద్యుత్ సదుపాయం ఇంకా చాలా చాలా అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించాము.
వాటన్నిటికీ ఆయన చాలా ఓపికగా, సంతృప్తికరమైన సమాధానాలు చెప్పారు. ఇక కాదనడానికి మాకు అవకాశం లేకుండా చేశారాయన. సరే ఒకే చెప్పేశాము.
కానీ నారా లోకేష్ ఒకే అంటే కుదరదు, వచ్చే ఏడాది దావోస్ సదస్సు జరిగేలోగా విశాఖలో మీ ఆపరేషన్స్ మొదలుపెట్టాలని డెడ్‌లైన్ పెట్టేశారు!
ఇంత తక్కువ సమయంలో ఎలా సాధ్యం? అని మేము ప్రశ్నించాము. ఎలా సాధ్యమో చూపిస్తాను, ముందు మీరు ఏపీకి రండి అని చెప్పి వెళ్లిపోయారు.
నిజంగానే కాగ్నిజెంట్ ఏడాది కాదు, 11 నెలల్లోనే ప్రారంభించేలా చేశారు. 2026 జనవరిలో మళ్లీ దావోస్ సదస్సు జరుగుతుంది. నెలరోజుల ముందే కాగ్నిజెంట్ విశాఖలో ఆపరేషన్స్ మొదలైపోయాయి. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది,” అని చెప్పారు కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు స్టోరీ వేరే ఉంది. మొన్న విశాఖలో కాగ్నిజెంట్ భూమిపూజకు వచ్చినప్పుడు, కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ ఆయనతో మాట్లాడుతూ, “మీరు చెప్పినట్లుగానే 8,000 మందితో ఇక్కడ మా ఆపరేషన్స్ మొదలు పెట్టాము. మేము సేవలు అందిస్తున్న కంపెనీలతో మాట్లాడి త్వరలో విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము. అప్పుడు మరో 17,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి,” అని చెప్పారు.
సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “ఏంటి మొత్తం 25,000 మందా? ఏమాత్రం సరిపోదు. కనీసం లక్షకు పెంచండి,” అంటూ మొహమాటం లేకుండా చెప్పేశారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీరు చూస్తే పరిశ్రమలు, పెట్టుబడుల విషయంలో తండ్రీ–కొడుకుల మధ్యే గట్టి పోటీ నెలకొని ఉన్నట్లనిపిస్తుంది. ఈ పోటీలో ఇద్దరిలో ఎవరు నెగ్గినా మంచిదే… చాలా సంతోషమే!
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…