
షూటింగ్ లో భాగంగా రోప్ షాట్ చిత్రీకరిస్తున్న సమయంలో జారిపడ్డ పృధ్వీ, స్వల్ప గాయాలయ్యాయట. దీంతో షాక్ తిన్న చిత్ర యూనిట్, పృథ్వీని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. పృథ్వీని పరీక్షించిన వైద్యులు మేజర్ గాయాలేమీ కాలేదని తేల్చారు. అలాగే పృథ్వీ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
దీనిపై స్పందించిన పృధ్వీ, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, తన ఆరోగ్యం మెరుగుపడాలని చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఫోటోలలో పృధ్వీ బాగానే ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంతగానో కష్టపడితేనే పృధ్వీ ఈ స్థాయికి వచ్చాడని, ఇటీవలే బుల్లితెరపై ఓ కార్యక్రమంలో ‘ప్రభాస్’ శ్రీను ప్రశంసలు కురిపించారు.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…