‘అమ్మ దీనమ్మ బత్తాయో…’ అంటూ ‘యుముడికి మొగుడు’ సినిమాలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే మరోసారి ఆ ‘బత్తాయి’ని పట్టుకుని ఆగష్టు 12వ తేదీన రాబోతున్నాడు పృధ్వీ. విక్టరీ వెంకటేష్ హీరోగా ‘బాబు బంగారం’ సినిమాలో ‘బత్తాయి బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఆడియో వేడుకపైన స్పష్టం చేసాడు. అంతేకాదు… ‘కాయ నలక్కుండా తొక్క తీయకుండా రసం పిండేస్తా’ అంటూ ఓ కామెడీ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించాడు పృధ్వీ.
“నటనకు డిక్షనరీ అంటే వెంకటేష్ బాబు మాత్రమేనని, యాక్టింగ్ పరంగా అందరి హీరోలు చెప్తుంటారు, కానీ మానవత్వంతో కూడిన విలువలు తెలుసుకోవాలంటే ఒక్క వెంకటేష్ బాబు గారి దగ్గర మాత్రమే… దటీజ్ బాబు బంగారం… సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వుద్ది… ఈ బత్తాయి బాబ్జీ చెప్తున్నాడు…” అంటూ పృధ్వీ చేసిన ప్రసంగానికి వెంకీ ఓ చిరునవ్వు నవ్వగా, విక్టరీ అభిమానులు విజిల్స్ తో అభివాదాలు చేసారు. మొత్తమ్మీద ‘బాబు బంగారం’ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందని గ్యారెంటీ ఇచ్చారు ఈ ‘బత్తాయి బాబ్జీ.



