
సంక్షేమానికి ఆవడ దూరంలో సంక్షోభానికి కూతవేటంత దగ్గరలో బతుకు బండి లాగుతున్న సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ 2023 కి వీడ్కోలు పలకడానికి సిద్ధపడ్డారు. క్యాలెండర్లో తేదీలు మారినా, ఐదేండ్ల కొకసారి ప్రభుత్వాలు మారినా, రాజకీయ నాయకుల స్థితిగతులు పెరిగినా వీరి అభివృద్ధిలో “తులసి దలమంతా” మార్పు కూడా కనపడదు.
పేదలకు ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాల భారాన్ని మోస్తూ అటు పేదలకు – ఇటు ప్రభుత్వానికి,పెత్తందారులకు మధ్య నలిగిపోవడం మధ్యతరగతి కుటుంబాలకు దశాబ్దాల నుండి అలవాటుగా మారిపోయింది. ఈ 2023 కూడా అవే చేదు జ్ఞాపకాలను మిగిల్చి బై బై చెప్పడానికి సిద్ధపడిందనే చెప్పాలి.తమ కష్టాన్ని గుర్తించని ప్రభుత్వాలను, తమకు సుఖాలను అందించలేని కాలాన్ని నమ్ముకుంటూ బతుకు బండి లాగడం మధ్యతరగతి వాడి కర్తవ్యంగా మిగిలిపోయింది.
ముఖ్యంగా ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య వైరాలు, ఆధిపత్య ధోరణితో రాజధాని లేని రాష్ట్రంగా, సంక్షేమం తప్ప అభివృద్ధి పై ద్రుష్టి పెట్టని ప్రభుత్వ నిర్ణయాల వలన, అధికార పార్టీ కక్ష్యపూరిత రాజకీయ నిర్ణయాల ఫలితంగా, కొత్త పరిశ్రమలు రాక, యువతకు ఉద్యోగ అవకాశాలు లేక, “పెరిగిన ధరలతో తగ్గిన ఆదాయంతో” రాబోయే కొత్త ఏడాది కోసం ఆశతో ఎదురుచూడడం తిరిగి అదే నిరాశతో సర్దుకుపోవడం సామాన్యుడి దినచర్యగా
మారిపోయింది.
గత సంవత్సరాలలో తమ జీవితాలలో కరోనా మిగిల్చిన కల్లోలం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ నిలబడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు 2023 తానూ వెళ్లేటప్పుడు రూపాన్ని మార్చుకున్నకరోనాతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మళ్ళీ ప్రపంచం ముంగిట నిలిచింది. భయంతో 2023 కూ వీడ్కోలు పలికి వాక్సిన్లతో 2024 కూ స్వాగతం పలకాలేమో అన్నటుగా రోజురోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి.
తరాలు గడిచి పోతున్న భారత దేశం ఇప్పటికి అభివృద్ధి చెందుతున్న దేశంగా మిగిలిపోయినట్టు,ఏళ్ళు గడిచినా మధ్యతరగతి జీవితం కూడా ఇలానే ఆశకు – ఆరాటానికి మధ్య మిగిలిపోతుంది.ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం అభివృద్ధి పంధాలో సరైన మార్గంలో నడుస్తుందని అర్ధం. అది జరిగేదెప్పుడో … చూసేదెవ్వరో…?
Yash’s Toxic has been getting mixed reactions since its release, but the actor is finding…
The YSR Congress top leadership is absolutely rattled by the recent developments concerning Vijaya Sai…