
దేశంలో ప్రధాని మోడీని అమితంగా ద్వేషించేవారు సైతం ‘ఆపరేషన్ సింధూర్’తో ఇప్పుడు ఆయనకు జై కొట్టక తప్పని పరిస్థితి కల్పించారు. పహల్గాం దాడిని యావత్ దేశ ప్రజలు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. అది చాలా సహజం.
కానీ ఆ తర్వాత ‘సింధూ జలాల నిలిపివేత’ వంటి మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ‘ఆపరేషన్ సింధూర్’ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముక్త కంఠంతో స్వాగతించాయి.
అది ప్రధాని మోడీ సాహసోపేతమైన నిర్ణయాన్ని మెచ్చుకోవడమే అవుతుంది కనుక కొన్ని పార్టీలు స్పందించకుండా మౌనంగా ఉండిపోయాయి. కానీ మెజారిటీ భారతీయులు ‘ఆపరేషన్ సింధూర్’ని స్వాగతిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఆపరేషన్‌కి ‘సింధూర్’ అని పేరుపెట్టడంతో దేశంలో మహిళలందరూ ప్రధాని మోడీకి జేజేలు పలుకుతున్నారు. పహల్గాంలో భార్యల కళ్ళ ఎదుటే వారి భర్తలను ఉగ్రవాదులు కాల్చి చంపి వారి నుదుట బొట్టు చెరిపివేసినందున, మహిళల తరపున ప్రధాని మోడీ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నారని భావిస్తున్నారు.
అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ఆర్మీ, వాయుసేనకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ద్వారా మీడియాకు వివరింపజేయడం కూడా మోడీ, అమిత్ షాల తెలివితేటలకు మరో నిదర్శనం. తద్వారా భారతీయ మహిళల శక్తి సామర్ధ్యాలు యావత్ ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. ఇది కూడా దేశంలో మహిళలు మోడీ ప్రభుత్వానికి జేజేలు పలికిస్తోంది.
ఇక ఈరోజు తెల్లవారుజాము నుంచి ఆపరేషన్ సింధూర్ గురించి మీడియా వర్ణిస్తున్న తీరు చూస్తుంటే, ప్రధాని మోడీయే స్వయంగా యుద్ధ విమానం నడిపించుకుంటూ పాకిస్థాన్‌లోకి వెళ్ళి ఉగ్రవాదులను మట్టుబెట్టి తిరిగి వచ్చారనట్లుంది.
దేశ ప్రజలలో ఇంతగా దేశభక్తి, మోడీ పట్ల గౌరవం కనబడుతుంటే, ఈ పరిస్థితిలో ప్రజాభిప్రాయనికి వ్యతిరేకంగా మాట్లాడలేక, ప్రధాని మోడీని సమర్ధించలేక ఆయన రాజకీయ శత్రువులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రజలందరూ ప్రధాని మోడీని గెలిపించేందుకు బీజేపి, ఎన్డీఏ కూటమికే ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని వేరే చెప్పక్కరలేదు. కానీ ప్రస్తుతం ఎన్నికలు లేవని కాంగ్రెస్, బీజేపి వ్యతిరేక శక్తులు సంతోషపడాల్సిందే!
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…