Telugu

కాంగ్రెస్ ద్వంద్వ రాజకీయం..!

జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు విధానాలతో ముందుకు వెళ్లాలని భావిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అక్కడి ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం తీసుకు వస్తామంటూ ప్రచారం చేసుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బాధ్యతను వైస్ షర్మిల కు అప్పగించిన పార్టీ అధిష్టానం ఇక్కడ రాజన్న రాజ్యం తెస్తామంటూ హామీ ఇస్తుంది. ఇందిరమ్మ, వైస్సార్ ఇద్దరు కాంగ్రెస్ నాయకులే అయినప్పటికీ ఒక రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం మరో రాష్ట్రంలో రాజన్న రాజ్యం అంటూ ఒకే పార్టీలో ఇద్దరి నేతల పేర్లతో కాంగ్రెస్ రాజకీయం మొదలుపెట్టింది.

ADVERTISEMENT

రాష్ట్ర నాయకత్వాన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఉంటుందా.? లేక రాష్ట్ర పరిస్థితులను అక్కడి ప్రజల ఆకాంక్షలను బట్టి పాలన చేస్తారా.? చెట్టు పేరు చెప్పి కాయలమ్మే సంస్కృతీ ఈ తరం రాజకీయాలలో ఎక్కువకాలం మనుగడ సాగించలేవు అని జగన్ ఇప్పటికే రుజువు చేశారు. ఇందిరమ్మ పాలన ఈ తరం యువతకు తెలియదు. రాజన్న పాలన నిన్న తరం చూసేసింది.

నేటి తరం మార్పును కోరుకుంటుంది. లేదా ఆ మార్పుకు అనుగుణంగా మారే నాయకత్వాన్ని కోరుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి పాలన నచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ పాలన కూడా నచ్చాలని లేదు. నచ్చలేదు కాబట్టే వైస్సార్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11 కి తెచ్చారు. అలాగే జనరేషన్ కు తగ్గట్టే బాబు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు కాబట్టే రాష్ట్రం సమస్యలలో ఉన్న ప్రతిసారి బాబును ముందుకు తెస్తున్నారు.

అలాగే ఇందిరమ్మ వారసుడిగా రాహుల్ దశబ్ద కాలం నుండి ప్రతిపక్షంలో పోరాడుతున్న రాహుల్ కు ప్రధాని అయ్యే బలాన్ని ప్రజలు అందించలేదు. యువ నాయకత్వాన్ని కాదని ఆరు పదుల వయస్సు ఉన్న మోడీకే దేశ ప్రజలు మళ్ళీ జై కొట్టారు. గత పాలకుల పేర్లు చెప్పి రాజకీయాలలో ఎదగాలి, పదవులు పొందాలి అనుకోవడం కాంగ్రెస్ అవివేకమే అవుతుంది.

తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును అడ్డుపెట్టుకుని జగన్ చేసిన రాజకీయానికి ప్రజలు ఒక్క ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోక పోవడం వల్లనే జగన్ ఇప్పుడీ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. గత ఐదేళ్లుగా వైసీపీ ఏపీ ప్రజలకు రాజన్న పాలనను చూపించింది. దాన్ని కాదనే ప్రజలు కూటమికి పట్టం కట్టారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. అలాగే ఏపీలో కాంగ్రెస్ కూడా విభజన మంటలలో కాలి బూడిదయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

32 seconds ago

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

28 minutes ago