Telugu

AI … వీరే ఇలా చేస్తే ఎలా.?

అరచేతిలోకి ప్రపంచం అంటూ టెక్నాలజీ వినియోగంతో కదులుతున్న నేటి సమాజం ఆ టెక్నాలజీని సక్రమంగా వినియోగిస్తుందా అంటే అందులో కొంత శాతం తమ ఎదుగుదలకు దాన్ని వినియోగిస్తుంటే మరికొందరు ఎదుట వారిని కించపరిచేందుకు, వారిని ఎదోరకముగా బాధించేందుకు వాడుతున్నారు.

అయితే సాధారణ ప్రజలు ఇలా చేస్తున్నారు అంటే అది వారి పరిణితి ఇంతేలే అని కాస్త సరిపెట్టుకోవచ్చు కానీ, సమాజాన్ని ప్రభావితం చెయ్యాలనుకుంటున్న రాజకీయ నాయకులు ఇటువంటి నీచాలకు తెగబడుతుంటే మాత్రం అది సహింపజాలదు.

ADVERTISEMENT

తమ పార్టీ సిద్ధాంతాలను, తమ నాయకుల ఘనతలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకోవడాన్ని ఎవరు తప్పుబట్టారు. కానీ అది ప్రత్యర్థి పార్టీల నేతలను అవమానపరిచేలా, రాష్ట్ర గౌరవ మర్యాదలను కించపరిచేలా, దేశ పరువుని తుంచేలా ఉంటే మాత్రం వాటిని వెనువెంటనే ఖండించాలి, అలాగే AI తో అటువంటి పోస్టులు తయారు చేసి ప్రచారం చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మధ్య ఆయా పార్టీల నాయకుల మధ్య జరిగే ఈ సోషల్ మీడియా యుద్ధాలలో ఒకరి పై మరొకరు చేసుకునే పోస్ట్ లు ఆ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తాయి. అలాకాకుండా జాతీయ పార్టీలుగా ఉన్న పార్టీల మధ్య జరిగే ఈ మహా సంగ్రామంలో ఒక్కోసారి ఈ పోస్ట్ లు దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తాయి.

ఇప్పుడు అటువంటి పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. AI సహకారంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ ప్రతినిధి రాగిని నాయక్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు వివాదంగా మారింది. ఒకప్పుడు ఛాయ్ వాలా గా ఉన్న నరేంద్ర మోడీ ఇప్పుడు భారత ప్రధానిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.

అలాగే అంతర్జాతీయంగా బలమైన నేతగా ఎదిగారు. అటువంటి దేశ ప్రధాని పై కాంగ్రెస్ మహిళా నేత చేసిన ఈ పోస్ట్ ఆ పార్టీ నైతికతను ప్రశ్నించేలా ఉంది. అంతర్జాతీయంగా జరిగే గ్లోబల్ ఈవెంట్ లో సూట్ తో రెడ్ కార్పెట్ పై మోడీ టీ అమ్ముకుంటూ వస్తున్నట్టు చేసిన AI వీడియో ని రాగిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

దీనితో బీజేపీ ఈ పోస్ట్ పై మండిపడింది, కాంగ్రెస్ తీరు పై విరుచుకుపడింది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి పార్టీని విమర్శించడం, తమ ప్రత్యర్థి నాయకుడిని రాజకీయంగా టార్గెట్ చేయడం ఎవరికీ ఇబ్బంది కాదు. కానీ ఒక దేశ ప్రధానిని ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అంటే అది దేశ ప్రతిష్టతను దెబ్బ తీయడమే అవుతుంది.

నేటి సోషల్ మీడియా జమానాలో ఎక్కడో అనకాపల్లి వంటి మారుమూల ప్రాంతంలో పెట్టిన పోస్ట్ కూడా ఒక్కో సందర్భంలో ఖండాంతరాలు దాటి మరెక్కడో అమెరికాలో వైరల్ కాగలదు. అటువంటి సందర్భంలో ఇలా ఒక దేశ ప్రధానిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అది మన భారత పరువుని బజారున పెట్టినట్టు కాదా.?

ఇటువంటి అర్ధం పర్ధం లేని చర్యలే కాంగ్రెస్ ను మరింతగా పతనం వైపుకి నడిపిస్తున్నాయి. ఇలా రాజకీయంగా సమాజన్ని ప్రభావితం చేస్తున్న, చేయాలనుకుంటున్న నేతలే హద్దులు దాటి, దిగజారి టెక్నాలజీ ని దుర్వినియోగం చేస్తుంటే ఇక సభ్య సమాజాన్ని ఎలా మంచి దారిలో పెట్టగలరు.?

ఒక ఛాయ్ వాలా దేశ ప్రధానిగా ఎదగడం, ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపు, గౌరవం పొందడం సమాజానికి స్ఫూరి దాన్ని అలా ప్రచారం చేస్తే అది బలహీనులను బలవంతులను చెయ్యగలదు, అలాగేర్ భవిష్యత్ మీద ఆశలు సజీవంగా ఉంచగలదు. కానీ ఇలా ఒక దేశ ప్రధానిని ఛాయ్ వాలా అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయనను అలా ప్రపంచానికి పరిచయం చెయ్యడం దిగజారుడితనం అవుతుందని గ్రహించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Big Violence Loading @ Cockroach Protest On Oct 10?

The Cockroach Janta Party movement is stepping up its protests against the central government and…

31 minutes ago

రాహుల్ కోసం రేవంత్‌… రిస్క్ తీసుకుంటున్నారా?

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు…

39 minutes ago