Telugu

రాహుల్ కోసం రేవంత్‌… రిస్క్ తీసుకుంటున్నారా?

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక కాంగ్రెస్‌ అధిష్టానం మెప్పు పొంది తెలంగాణలో తన పదవి, అధికారాన్ని పదిలం చేసుకుంటున్నారా?అంటే రెంటికీ అవుననే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఢిల్లీ పోలీసులు రాహుల్‌ గాంధీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే సిఎం రేవంత్‌ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళి రాహుల్ అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ADVERTISEMENT

ఎస్‌ఐఆర్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమీషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌ కలిసి దేశంలో కోట్లాదిమంది ఓటర్లను జాబితాలో నుంచి తొలగిస్తున్నారని, ఇది పెద్ద రాజకీయ కుట్ర అని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ఈ ప్రక్రియను తక్షణం ఉపసంహరించుకొని, తొలగించిన అర్హులైన ఓటర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని, జ్ఞానేశ్‌ కుమార్‌ చేత తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాహుల్‌ నాయకత్వంలో ఇండియా కూటమిలో పార్టీలతో కలిసి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

ఇప్పుడు ఏపీలోని జగన్‌ పరామర్శ యాత్రల గురించి రెండు ముక్కలు చెప్పుకోవాలి. ఆ పేరుతో ఆయన బలప్రదర్శన చేస్తున్నారు. జైలు పాలైన పార్టీ నేతలకు తాను అండగా ఉన్నానని చెప్పి వారు చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన చేసే ప్రతీ పరామర్శ యాత్రతో వైసీపీ ప్రతిష్ట మసకబారుతూనే ఉంది.

కానీ రేవంత్ చేసిన ఈ ఒక్క పరామర్శ యాత్రతో రెండు ప్రయోజనాలు పొందుతారు.

1. కాంగ్రెస్‌ అధిష్టానం మనసు గెలుచుకోగలుగుతారు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ మనసు గెలుచుకుంటారు. కనుక తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్‌ విషయంలో ఆయనకు మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్‌ నేతలు మళ్ళీ ఆయన దారికొస్తారు.

2. కాంగ్రెస్‌ ద్వారా జాతీయ స్థాయి రాజకీయాలలో పరిచయాలు పెరుగుతాయి. ఇప్పటికే జాతీయ స్థాయి నాయకుడుగా సిఎం రేవంత్‌ రెడ్డి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపై ఆయన కీలకంగా మారవచ్చు.

గతంలో ప్రధాని మోడీపై కత్తులు దూసిన అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్‌ వంటి వారి పరిస్థితి ఏమయిందో అందరికీ తెలుసు. ఇంతకాలం కేంద్రంతో, ప్రధాని మోడీతో సఖ్యతగా వ్యవహరించిన సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇప్పుడు కేసీఆర్‌లాగే కత్తులు దూస్తున్నారు. కనుక సిఎం రేవంత్‌ చాలా రిస్క్ కూడా తీసుకుంటున్నారని చెప్పక తప్పదు.

కనుక రేవంత్‌ తాజా వైఖరితో రాజకీయంగా ఆయనకు కొంత లాభం, మరికొంత నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. కానీ ఈ లాభ నష్టాల లెక్కలు సరిచూసుకునే సిఎం రేవంత్‌ రెడ్డి ఈ వైఖరి ఎంచుకొని ఉంటారు. కనుక దీని ప్రతిఫలాలు లేదా పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో రాబోయే రెండేళ్ళలో తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Will Filmmakers Now Write With the Censor Board in Mind?

Getting a film to the release date is one thing. Getting it past the censor…

23 minutes ago

REJECTED! Ram Charan In No Mood to Repeat Past Blunders?

Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…

52 minutes ago