తాజ్ మహల్ కు ‘మతం’ రంగు?

tajmahal linking to religionఆగ్రాలోని ప్రముఖ పాలరాతి కట్టడం తాజ్ మహల్ హిందూ ఆలయమనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మ ఈ విషయాన్ని లోక్‌‌సభలో స్పష్టం చేశారు. తాజ్‌‌ను హిందూ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ ఆగ్రా కోర్టులో ఓ వ్యక్తి దావా వేసిన విషయాన్ని ఓ పార్టీ సభ్యుడొకరు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

ప్రభుత్వానికి ఈ విషయం తెలుసునని అన్నారు. ఈ వివాదం వల్ల టూరిజం రంగానికి ఎలాంటి దెబ్బ వాటిల్లలేదని ఆయన పేర్కొన్నారు. ఇక సాహిత్య అకాడెమీ అవార్డులను కొందరు కవులు, రచయితలు వాపసు చేయడాన్ని ఆయన ప్రస్తావిస్తూ..వారు తమ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించుకోవాలని కోరారు. అవార్డులను తిరిగి ఇచ్చేసిన 39 మంది రైటర్ల జాబితాను ఆయన సభకు సమర్పించారు.

ADVERTISEMENT
Latest Stories