పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో హుజుర్ నగర్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన తన భార్య పద్మావతి బరిలోకి దించి, కాంగ్రెస్ ఈ సీటును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. కాంగ్రెస్ నుండి ఈ సీటు లాక్కుని తన సత్తా చూపించాలని తెరాస కూడా గట్టి ప్రయత్నాలే చేస్తుంది.
మరోవైపు బీజేపీ ఇటీవలే తన పార్లమెంట్ ఎన్నికల అనూహ్య ఫలితాలు గాలి వాటం కాదని నిరూపించే పనిలో ఉంది. టీడీపీ కూడా ఈ సారి పోటీ లో ఉంది. ఎన్నికల తేదీని ప్రకటించగానే తాము కూడా పోటీ చేస్తామని సిపిఐ నాయకులు తొడగొట్టారు. అయితే అన్ని లెక్కలు వేసుకున్నాకా డబ్బు రాజకీయాలు తాము తట్టుకోలేం అని పోటీ నుండి తప్పుకున్నారు.
ఇది ఇలా ఉండగా సీపీఎం అభ్యర్థి వేసిన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. 2014, 2018లో రెండుసార్లు ఆయన పోటీలో నిలబడ్డారు. ఈసారి అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్ నింపకపోవడమే తిరస్కరణ కు కారణంగా తెలుస్తోంది. దీంతో సీపీఎంలో గందరగోళం నెలకొంది. పాపం కామ్రేడ్స్ పరిస్థితి అంత ఘోరంగా ఉంది.
ఇది ఇలా ఉండగా గత ఎన్నికలలో ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన సైదిరెడ్డికి మళ్ళీ టిక్కెట్ ఇచ్చింది తెరాస. తాజాగా బీజేపీ బీసీ అభ్యర్థి కోటా రామారావుని తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీడీపీ తన సీనియర్ నేత చావా కిరణ్మయిని రంగంలోకి దించింది. అక్టోబర్ 21 న పోలింగ్, 24న కౌంటింగ్ జరుగుతుంది.





