
ఈ షోకు హోస్ట్ గా ఉన్న నాగార్జున ఒక అబ్బాయి ముందు ముగ్గురు హీరోయిన్ల ఫోటోలు పెట్టి, ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావ్, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్ అని అడిగితే, ఆ అబ్బాయి ఒక్కొక్కరితో ఒక్కొక్కటి చెప్తే కడుపు మండిపోయిందని అన్నారు.
ఆడవాళ్లను పట్టుకుని అంత నీచంగా మాట్లాడేటప్పటికి తనకు బాగా కోపం వచ్చేసిందని, నాగార్జున ఒక ఫేమస్ పర్సన్, నాక్కూడా అభిమాన హీరోనే, కానీ ఈ షో చూసిన తర్వాత అసహ్యం వేసేసిందని, కోపం అంటే నాతో సరిసమానంగా గట్టోడు అయ్యుండాలి, నాది కోపం కాదు, అసహ్యం అని తేల్చిచెప్పారు.
నాగార్జున వాళ్ళ ఇంట్లో కూడా హీరోయిన్లు ఉన్నారుగా, వాళ్ళ బొమ్మలు పెట్టొచ్చు కదా! అందులోనూ వయసులో ఉన్న యువతీ యువకులను తీసుకువచ్చి 100 రోజుల పాటు ఒక దగ్గరే ఉంటే, చెడు పనులు చేయకుండా ఉంటారా? విశ్వామిత్రుడు అంతటి వాడే కాలు జారాడు, వీళ్ళు ఓ లెక్కా?
‘బ్రోతల్ హౌస్’ అంటావా నీ మీద కేసు పెడతామని తనతో కూడా అన్నారని చెప్పిన నారాయణ, కేసు పెట్టుకోమని బదులిచ్చినట్లుగా తెలిపారు. ఏదైనా ఒక ఊర్లో కొత్త వారిని తీసుకువచ్చి ఒక పది రోజులు ఇంట్లో ఉంచితే, బయట ఏం మాట్లాడుకుంటున్నారో వినండి, ఖచ్చితంగా ఇది వ్యభిచార కొంప అన్న కామెంట్స్ చేస్తారని అన్నారు.
ఒకవేళ బిగ్ బాస్ షోలో ఎలాంటి కార్యక్రమాలు జరగకపోతే, 24 గంటలు లైవ్ పెట్టమని చెప్పండి అప్పుడు అసలు విషయం తేలుతుందని అన్నారు. అందరూ చూస్తున్నారని అదే మంచిదని వాళ్ళ వెంట మనం పడలేము కదా… అసలు ఆ షో ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? మంచి ఏమైనా ఉందా? అంతా చెడు తప్పితే అంటూ ‘బిగ్ బాస్’ షో గురించి తన అభిప్రాయం చెప్పుకొచ్చారు నారాయణ.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…