
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అర్నాబ్ తుఫాన్ దాటికి ఏపీలో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. అర్నాబ్ సృష్టించిన విధ్వంసానికి విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
అర్ణబ్ తుఫాన్ బీభత్సానికి కురుస్తున్న వర్షాలతో విశాఖ వణుకుతుంది. ఎక్కడికెక్కడ చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడడం, విద్యుత్ స్తంభాలు నెలకొరగడం, ఇంటర్ నెట్ అందుబాటులోకి రాకపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు కోనసీమ జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యల మీద ద్రుష్టి సారించింది.
అర్నాబ్ దెబ్బకి రాష్ట్రంలో పలు జిల్లాలలో విద్యుత్ సమస్యలు ఎదురవడంతో ఏపీ ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ శాఖ సహాయం కోరాల్సి వచ్చింది. అందుకు తెలంగాణ విధ్యుత్ శాఖ కూడా స్పందించి ఏపీ సమస్యల పరిష్కారానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ముందుకొచ్చింది.
అటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి క్షణం తుఫాన్ ప్రభావిత జిల్లాల పై సమీక్షలు నిర్వహిస్తూ ఆయా ప్రాంతాల మౌలిక వసతుల కల్పనకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అర్నాబ్ సృష్టించే విధ్వంసాన్ని పూర్తిగా అడ్డుకోలేకపోయినా దాని తీవ్రతను తగ్గగించేందుకు, ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని సహాయక చర్యలు ప్రజలకు అందుబాటులో ఉంచేలా బాబు అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తున్నారు.
ఇటు అర్నాబ్ దెబ్బకి ముఖ్యంగా రైతులు తీవ్ర నష్టం ఎదుర్కుంటున్నారు. కురుస్తున్న భారీ వర్షాలతో నీరు పంటపొలాలను ముంచెత్తింది. ఇక శ్రీకాకుళంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్టీసీ బస్సు స్టాండ్ చెరువును తలపిస్తుంది. అలాగే ఇటు ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురయ్యింది.
అటు అల్లూరి జిల్లాలో వర్ష భీభత్సానికి పలు ప్రాంతాలలో వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అర్నాబ్ తీరం దాటినప్పటికీ ఇంకా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ప్రభుత్వ అధికారులు ఇస్తున్న సూచనలను, ఆదేశాలను పాటిస్తూ ఉండాలంటూ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…
Following its Los Angeles premiere, Ramayana: Part 1 has received mixed reactions from viewers. While…