Telugu

టాటాగ్రూప్ మాజీ ఛైర్మన్‌ సైరస్ మిస్త్రీ దుర్మరణం

టాటాగ్రూప్ మాజీ ఛైర్మన్‌ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆదివారం ఆయన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబైకి కారులో వస్తుండగా మధ్యాహ్నం 3.15 గంటలకు మహారాష్ట్రలో పాల్గర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చోన్న సైరస్ మిస్ట్రీతో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందగా, కారు డ్రైవ్ చేస్తున్న మహిళ, ముందు సీట్లో పక్కన కూర్చోన్న ఆమె భర్త ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సైరస్ మిస్ట్రీ, మరో వ్యక్తికి తలకు తీవ్ర గాయం అవడం వలన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

సైరస్ మిస్ట్రీ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT


—

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Spirit vs Ramayana 2: Prabhas-Vanga Walking into a Trap?

Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…

3 minutes ago

కేంద్రంతో కటీఫ్‌.. జగన్‌ సిద్దపడుతున్నట్లేనా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…

6 minutes ago