
అయితే ఎన్టీఆర్ పై తీసే సినిమాలో కచ్చితంగా వైస్రాయ్ హోటల్ సంఘటన ఉండాలని పురందేశ్వరి చెప్పుకొచ్చారు. ‘ఎన్టీఆర్ ఆశయాలకు తాను ఏనాడూ తూట్లు పొడవలేదు, ఎన్టీఆర్ పేరు అనేది ఓ చరిత్ర, ఆ చరిత్రను ఎవరూ వక్రీకరించలేరని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తనకు కోపం ఎందుకు ఉంటుందని, చంద్రబాబుతో శత్రుత్వం లేదు గానీ, భిన్నాభిప్రాయాలు మాత్రం ఉన్నాయని అంగీకరించారు. చంద్రబాబు నాయకత్వానికి మార్కులు వేసే స్థాయి నాకు లేదు, రాష్ట్ర ప్రజలే మార్కులు వేస్తారంటూ అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై నాడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఏపీలో జరిగిన ఫిరాయింపులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని, తాను రాసిన లేఖ పై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. నారా లోకేష్ మంత్రి పదవి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించి తమను ఎవరూ ఆహ్వానించలేదని, తమను ఆహ్వానిస్తే వెళ్లే వాళ్లమని, పిలవని పేరంటానికి వెళితే బాగుండదని, అయితే లోకేష్ కు తమ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
నాడు ఒంటరి జీవితంలో తోడు కావాలని కోరుకున్న ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయమేనని, ఎన్టీఆర్ ను చివరి దశలో ఆయన పిల్లలెవ్వరూ పట్టించుకోలేదనే విషయం కరెక్టు కాదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా నేడు నడవటం లేదని విమర్శించారు. ‘రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన వారసులు కారు, ఎవరైతే వారి ఆదర్శాలను కొనసాగిస్తారో వారే నిజమైన వారసులు’ అని తన తమ్ముడు బాలకృష్ణ ఒకానొక సమయంలో స్వయంగా చెప్పారని పురందేశ్వరి అన్నారు.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…