బన్నీ, మహేష్ లకు సురేష్ బాబు టెన్షన్

Daggubati Suresh Babu headache for Allu Arjun and Mahesh Babuఅల్లు అర్జున్, మహేష్ బాబు. వెంకటేష్ – నాగచైతన్యల వెంకీ మామ సంక్రాంతికి వస్తుందనే వార్తలు వస్తుండడంతో, సురేష్ బాబు తో థియేటర్ల పోటీ కోసం ఇద్దరూ నిన్న సాయంత్రం తమ సినిమా విడుదల తేదీలను ఒకరి తరువాత ఒకరు ప్రకటించారు. అయితే అలా వైకుంఠపురములో…, సరిలేరు నీకెవ్వరు రెండూ జనవరి 12నే విడుదల కానున్నట్టు ప్రకటించాయి.

ADVERTISEMENT

అయితే పరిశీలకులు మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పుకోవడం ఖాయమని, రెండు సినిమాలూ ఒకేరోజు వచ్చి ఇద్దరూ నష్టపోవడం అనేది జరగదని అంటున్నారు. ఎవరు ఎప్పుడు వచ్చినా ఇద్దరికీ ఇప్పుడు సురేష్ బాబు టెన్షన్ మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలో సురేష్ బాబు కింద చెప్పుకోదగిన స్థాయిలోనే థియేటర్లు ఉన్నాయి.

ఇప్పుడు వెంకీమామ సినిమా కోసం వాటిని బ్లాక్ చెయ్యడంతో రెండు సినిమాలకు నష్టమే. ఇప్పటికే ఈ విషయం సురేష్ బాబు తన ఆధ్వర్యంలోని థియేటర్ల మేనేజర్లకు సంక్రాంతికి ఎటువంటి సినిమాల అగ్రీమెంట్లు చేసుకోవద్దని చెప్పారట. మొదట మన సినిమాకే ప్రిఫరెన్స్ అని చెప్పారట. దీనితో మహేష్, బన్నీ ఇద్దరికీ టెన్షన్ మొదలయ్యింది.

అల వైకుంఠపురంలో సినిమాను త్రివిక్రమ్, సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరోవైపు గతంలో బన్నీకి రెండు పెద్ద హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సారి హాట్ట్రిక్ పూర్తి చెయ్యాలనుకుంటున్నాడు.

ADVERTISEMENT
Latest Stories