Telugu

దానం అనర్హత: రాజకీయాలలో క్లాసిక్ ఎగ్జాంపుల్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం రాజకీయాలలో క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. పార్టీలు ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు సాధారణంగా పరిస్థితి ఇంతదాకా తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడతారు. ఆయనతో పాటు బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారిన 9 మంది ఎమ్మెల్యేలు, తాము నేటికీ బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నామని చెప్పుకొని అనర్హత వేటు పడకుండా తప్పించుకున్నారు.

కానీ దానం నాగేందర్‌ దురాశకు పోయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ టికెట్ మీద 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌ బీ ఫారం మీద పోటీ చేసి తాను ఆ పార్టీలో చేరినట్లు ఆయనే స్పష్టమైన ఆధారం తన ప్రత్యర్ధులకు అందించారన్న మాట! ఆ ఆధారంతోనే బీఆర్ఎస్‌ న్యాయపోరాటం చేసి దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడేలా చేయగలిగింది. కనుక దీనిలో బీఆర్ఎస్‌ కృషి ఎంతుందో, దానం స్వయంకృతాపరాధం కూడా అంతే ఉందన్న మాట!.

నేడు సుప్రీంకోర్టు కూడా అయనపై అనర్హత వేటుని సమర్ధించింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు, దానం నాగేందర్‌కు ఎమ్మెల్యే పదవి ఉండగా, ఎంపీ పదవికి ఆశపడితే అది దక్కకపోగా ఎమ్మెల్యే పదవి కూడా ఊడింది.

అంతేకాదు.. అనర్హత వేటు పడినందున ఆరేళ్ళు మరే ఎన్నికలలో పోటీ చేయలేరు కూడా. కనుక రాజకీయాలలో ఉన్నవారు, ముఖ్యంగా… పార్టీ ఫిరాయించే ప్రజా ప్రతినిధులకు దానం అనర్హత కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్‌గా గుర్తుంచుకోవడం చాలా అవసరం.

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలిసుండాలి. లేకుంటే ఓ కొండా సురేఖ, ఓ దానం నాగేందర్‌లా ఎదురుదెబ్బలు తప్పవు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jason Sanjay Wants the Vijay Beyond the Superstar

Jason Sanjay has a rather interesting idea about the version of Vijay he would like…

5 minutes ago

Upasana Gets a Bigger Role as Apollo Goes Big

Upasana Kamineni Konidela is stepping into a new role at Apollo Hospitals, and the timing…

35 minutes ago