
ఇది ఇలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కేవలం 14 కోట్లు మాత్రమే బిజినెస్ చేసింది. రజినీకాంత్, మురుగదాస్ పేలవమైన ఫామ్ వల్ల బిజినెస్ పేలవంగా జరిగింది. 14 కోట్లు అనేది చాలా సింపుల్ టార్గెట్ గా కనిపించినా అది క్లిష్టమైనదే అని చెప్పుకోవాలి. రేపు అత్యధిక థియేటర్స్ లో సినిమా విడుదల అవుతుంది.
మొదటి రెండు రోజులు సినిమాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే మూడవ రోజు నుండి సరిలేరు నీకెవ్వరూ, నాలుగవ రోజు నుండి అల వైకుంఠపురంలో సినిమాలతో పోటీ ఉండడంతో థియేటర్లు కూడా దొరకని పరిస్థితి. దీనితో ఓపెనింగ్స్ కీలకంగా మారనున్నాయి. అయితే సినిమా కు ప్రేక్షకులలో పెద్దగా బజ్ కూడా లేదు.
మంచి టాక్ వస్తే తప్ప ఏదీ అంత తేలిక కాదు. ఈ సినిమాలో రజినీ సరసన నయనతార, నివేతా థామస్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించగా, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. చాలా కాలం తరువాత రజినీకాంత్ ఈ సినిమాలో పోలీసు పాత్రలో నటించబోతున్నారు.
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…
Generally, South Indian politics are extremely direct as the ruling and opposing factions can’t face…