టీజర్ టాక్ – ఇది సుకుమార్ స్టైల్ గురూ!

Darshakudu-Teaser-talkటాలీవుడ్ లో సుకుమార్ క్రియేటివిటీకి ఎవరూ సాటిరారు అన్నది ‘దర్శకధీరుడు’ రాజమౌళితో సహా చాలా మంది దర్శకుల అభిప్రాయం. ఓ సాధారణ సన్నివేశాన్ని కూడా తనదైన కొత్తదనంతో ప్రేక్షకులను అబ్బూరపరిచే విధంగా చిత్రీకరించడం సుకుమార్ సొంతం. అలాంటి సుకుమార్ కాంపౌండ్ నుండి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు అంటే… అంత కాకపోయినా ఎంతో కొంత కొత్తదనం ఉండడం సహజమే. అలాంటి కొత్తదనమే సుకుమార్ ప్రజెంట్ చేస్తోన్న “దర్శకుడు” టీజర్ ఇస్తోంది.

సుకుమార్ శిష్యుడు జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైంది. హీరోయిన్ నుండి ఒక సినిమా దర్శకుడు ఎలాంటి హావభావాలను పలికించాలో అన్న సన్నివేశం చూపించిన ఈ టీజర్ లో “కుమారి 21ఎఫ్” మాదిరి యూత్ కు చేరువయ్యేలా ‘లిప్ లాక్’ సీన్ ను చిత్రీకరించారు. సింపుల్ గా కనపడుతున్నా, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా టీజర్ ఉండడంతో జూన్ 9న విడుదల కాబోతున్న సినిమాపై అంచనాలు ఏర్పడ్డట్లే భావించవచ్చు. మరి దీనిపై మీరూ ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories