
ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పుడు తమ పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు భయంతో ఆర్నెల్లు కలుగుల్లో దాక్కున్నారు.
కానీ మహా అయితే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయించగలదు తప్ప మరేమీ చేయదని, ముందస్తు బెయిల్ లేదా అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్‌పై బయటకు వచ్చేయవచ్చని అందరికీ అర్దమైంది. కనుక ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. అందుకే రప్ప రప్పా ఫ్లెక్సీలు, డైలాగులు వినిపిస్తున్నాయి. డీజీపీని సైతం నోటికొచ్చినట్లు అనగలుగుతున్నారు.
ఆ మద్యన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో కాస్త వెనక్కు తగ్గినా మళ్ళీ మొదలుపెట్టేశారు.
వైసీపీ సోషల్ మీడియాలో నిత్యం సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాలలో ఇది సహజం అని సర్ధిచెప్పుకున్నా, ఆయన చెపుతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ ఉపయోగించి ఓ డీప్ ఫేక్ వీడియోని సృష్టించి సోషల్ మీడియాలో పెట్టడం చూసి మంత్రి నారా లోకేష్ సైతం షాక్ అయ్యారు.
దానిలో సీనియర్ జర్నలిస్ట్ మూర్తికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఓ ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, దానిలో ఓ కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఉంది.
ఇదో నకిలీ డీప్ ఫేక్ వీడియో అని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ వీడియో సృష్టించిన సైబర్ నేరగాళ్ళని విడిచిపెట్టబోనని, ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఈవిదంగా ఆటలాడుతున్నారంటే వారి వెనుక ఎవరున్నారో అర్దం చేసుకోవచ్చు. ఇటువంటి సైబర్ నేరాల గురించి నగరాలలో ఉన్న ప్రజలకే అవగాహన లేక మోసపోతున్నప్పుడు రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారు నమ్మకుండా ఉంటారా?
సిఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం గురించి నిరంతరంగా సోషల్ మీడియాలో ఈవిదంగా దుష్ప్రచారం జరుగుతుంటే జరిగే నష్టం ఎవరూ ఊహించలేరు. కనుక ఇప్పటికైనా దుష్ప్రచారాల విషయంలో కూటమి ప్రభుత్వం కటినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…