
దేశ రాజకీయాలలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురాలు కవిత, మనీష్ సిసోడియా లతో పాటు మరో 23 మందిని ఈ కేసు నుంచి విముక్తి చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ తీర్పు ఇచ్చింది.
దీనితో వీరంతా మేము కడిగిన ముత్యాల మాదిరి ఈ కేసు నుంచి బయటపడ్డాం అంటూ సంబరాలు చేసుకున్నారు. అలాగే బీజేపీ చేసిన రాజకీయ కక్ష్య సాధింపు చర్యలో భాగమే ఈ ఢిల్లీ లిక్కర్ కేసంటూ కేసు నేరం మొత్తం బీజేపీ పైకి నెట్టి ఈ కథ ఇక్కడితో ముగిసినట్టే అనుకుని శుభం కార్డు వేసేసారు.
అయితే ఈ ముగింపు కేవలం పార్ట్ – 2 కోసమే అనేలా ఈ ట్రయల్ కోర్ట్ తీర్పు పై విచారణ సంస్థ సీబీఐ ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించింది. దీనితో ఈ కేసులో ఇప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.
ఈ కేసులో సీబీఐ తరుపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ట్రయిల్ కోర్ట్ తీర్పు పై అభ్యంతరాలను లేవనెత్తారు. ఆ సమయంలో విచారణాధికారి పై కోర్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మానసిక స్తైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పేర్కొనడంతో స్పందించిన హై కోర్ట్ సీబీఐ పై చేసిన వ్యాఖ్యలకు గాను స్టే ఇచ్చింది.
అలాగే తదుపరి విచారణను మార్చ్ 16 కి వాయిదా వేసింది. దీనితో ఈ కేసులో ప్రముఖ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కవిత, సిసోడియా తో సహా మరో 23 మందికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీనితో ఇక ఢిల్లీ లిక్కర్ కేసు పార్ట్ – 2 మొదలుకానుందా అన్న అనుమానులు వ్యక్తమవుతున్నాయి.
అలాగే కవిత ఈ కేసులో న్యాయస్థానం తనకు క్లిన్ చిట్ ఇచ్చేసిందని, న్యాయం – ధర్మం గెలిచాయని, తన పోరాటం విజయం సాధించిందని, ఈ గెలుపు తన కోసం నిలబడిన ప్రతి ఒక్కరిది అని, తానూ ముందుగా చెప్పినట్టే ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకొచ్చానంటూ తొందరపడి కోయిల ముందే కూసినట్టు కవిత తొందరపడి ఇటువంటి ప్రకటనలు చేసారా.?
ఇక వేళ ఈ కేసు ఇప్పుడు మరో రూపం దాల్చితే కవిత మళ్ళీ న్యాయపోరాటాలు మొదలుపెట్టాల్సిందేనా.? మరి ఈ సారి ఈ కేసు పార్ట్ -2 నేరం ఎవరిని వరిస్తుందో, కవిత ఏ పార్టీని దోషిగా చూపిస్తుందో చూడాలి..!
Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…
November 20 could witness an interesting box-office battle, with Mammootty and Dulquer Salmaan finding themselves…