కులవివాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం

Deputy cm of Andhra Pradesh Pushpa Sreevani controversyఏపీలో ఎన్నికలు పూర్తయినా ఎన్నికల వేడి మాత్రం తగ్గలేదు. ఇప్పటికే టీడీపీ పై ఎన్నికైన కొందరి ఎన్నిక చెల్లదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కోర్టుని ఆశ్రయించారు. ఒకరైతే ఏకంగా చంద్రబాబు ఎన్నిక చెల్లదంటూ కోర్టుకు వెళ్లారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణీ కూడా ఇటువంటి వివాదంలోనే ఇరుక్కున్నారు.

ఆమె ఎస్టీ కాదంటూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగుమహేశ్‌, అఖిల భారత దళిత హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మణిసింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో జన్మించిన పుష్పశ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా ఆమెది కొండదేవర తెగ కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ADVERTISEMENT

దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలంటూ జిల్లా పరిశీలన కమిటీ విచారణకు కలెక్టర్‌ ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ వివాదంపై పుష్పశ్రీవాణి స్పందించారు. 2008 నుంచే ఈ వివాదం ఉందని.. 2014లోనూ తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా ఫిర్యాదు చేసిందన్నారు. ఇప్పుడు కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తులే ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.

ప్రతిసారి ఈ కేసు కోర్టుల్లో వీగిపోయిందని..ఈ దఫా కూడా న్యాయమే గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పుష్పశ్రీవాణి గిరిజన వ్యక్తి కాదని ఆరోపణలు రాగా ఆమె జగన్ మంత్రివర్గంలో గిరిజన శాఖా మంత్రిగా ఉండటం గమనార్హం. మేకతోటి సుచరితతో పాటు ఆమె ఆంధ్రప్రదేశ్ కు తొట్టతొలి మహిళా డిప్యూటీ సీఎంగా నియమించారు జగన్.

ADVERTISEMENT
Latest Stories