
ఇదివరకు అంటే ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏపీలో కేవలం రాజకీయాలు, తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుండేది. కానీ రెండు చోట్ల ప్రభుత్వాలు మారండంతో, ఇప్పుడు ఏపీలో అభివృద్ధి, తెలంగాణలో రాజకీయాలు మాత్రమే జరుగుతుండటం విశేషం.
కేసీఆర్ హయంలోనే అభివృద్ధి అంటే ఏమిటో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా తెలిసి వచ్చింది. అంతగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తమని తెలంగాణ ప్రజలు తిరస్కరించడం చూసి కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. అందువల్లే నేటికీ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదనుకోవచ్చు.
రేవంత్ రెడ్డి మంచి ప్రజాధరణతో భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చారు. ఇక బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని లేదా కూలిపోతుందని కేటీఆర్, హరీష్ రావు సవాలు విసరడం ఎవరూ ఊహించనిదే. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో రేవంత్ రెడ్డి వారికి చెక్ పెట్టారు.
కానీ అప్పటి నుంచి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, ఎన్నికల హామీల అమలులో వైఫ్యల్యాలను బిఆర్ఎస్ పార్టీ గట్టిగా ఎండగడుతూ మళ్ళీ పుంజుకుంది. కేసీఆర్ వారి మద్య లేనప్పుడే బిఆర్ఎస్ పార్టీ ఇంతగా పుంజుకోవడం రేవంత్ రెడ్డి వైఫల్యంగానే భావించవచ్చు.
అయితే ‘కేసీఆర్ అనే కలుపు మొక్కని మళ్ళీ తెలంగాణ నేల మీద మొలకెత్తనీయను’ అని చెపుతున్న రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని రాజకీయంగా కోలుకోలేని విదంగా దెబ్బ కొట్టేందుకు అనేక కేసులు సిద్దం చేస్తున్నారు. కూతురు కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉన్నందుకు కేసీఆర్ చాలా క్రుంగిపోయారని కేటీఆర్ స్వయంగా చెప్పారు.
అదే ఆయన రాజకీయ వారసుడైన కేటీఆర్ జైలుకి వెళితే.. కేసీఆర్ తట్టుకోగలరా? లేరు! అందుకే కేసీఆర్‌ని మానసికంగా దెబ్బ తీసేందుకు కేటీఆర్‌ని అరెస్ట్ చేసి జైలుకి పంపేందుకు రేవంత్ రెడ్డి ఫార్ములా-1 రేసింగ్ కేసుని సిద్దం చేశారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆ కేసులో కేటీఆర్‌కి నోటీస్ ఇచ్చిన్నట్లు సమాచారం. కేటీఆర్ చేతికి బేడీలు వేయడం ఖాయమని మంత్రి పువ్వాడ మళ్ళీ చెప్పారు. అంటే నేడో రేపో అదీ జరుగబోతోందన్న మాట!
ఇటువంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ కూడా ముందే ఊహించగలరు. బహుశః అందుకే కూతురు కల్వకుంట్ల కవితని మళ్ళీ రంగంలో దింపారనే టాక్ వినిపిస్తోంది. ఆమె తెలంగాణ తల్లి విగ్రహం వివాదాన్ని అనుకూలంగా మలుచుకొని దూసుకుపోతున్నారు.
కనుక కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య పోటాపోటీగా సాగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరుతో తెలంగాణ వేడెక్కిపోతోంది. ఆ కారణంగానే ఇప్పుడు వెనకబడిపోతోంది కూడా.
ఇదే సమయంలో సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతీ రంగాన్ని గుర్తించి ఆ దిశలో అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలనుకోవడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…