
వారందరూ పోలీసుల వద్దకే వెళుతుంటే దారిలో పామర్రు వద్ద పోలీసులు వారిని అడ్డగించారు. ముందుకు వెళ్ళడానికి అనుమతి లేదని వెనక్కు తిరిగిపోవాలని చెపుతూ సీఐ, ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు వారి కార్లకి అడ్డంగా నిలబడ్డారు. సుమారు రెండు గంటలసేపు టిడిపి నేతలందరూ కార్లలోనే ఉండిపోయారు.
“మేము గుడివాడ పోలీస్ స్టేషన్‌కు వెళుతుంటే మీరెందుకు మమ్మల్ని అడ్డుక్కొంటున్నారు?మేము పోలీస్ స్టేషన్‌కే గానీ మంత్రి ఇంటికి వెళ్ళడం లేదు కదా?”అని టిడిపి నేతలు గట్టిగా పోలీస్ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా వారి మద్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి.
టిడిపి నేతలు ఎంతకీ కారు దిగకపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని కారులో నుంచి దింపి గూడూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అడ్డువచ్చిన టిడిపి కార్యకర్తలని, మహిళా కార్యకర్తలని పక్కకు ఈడ్చి పడేసి టిడిపి నేతలను తీసుకుపోయారు.
వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించినందుకు గుడివాడ నియోజకవర్గం ఇన్ చార్జ్ రావి వేంకటేశ్వర రావు, టిడిపి నేతలు కాగిత కృష్ణ ప్రసాద్, జయమంగళం వెంకట రమణ తదితరులు ర్యాలీగా గుడివాడ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా వారినీ పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకొన్నారు.
ఈ ఘటనలపై దేవినేని ఉమ స్పందిస్తూ, “పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము గుడివాడ వెళుతుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?మా నాయకుడిపై, ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నానికి తగిన బుద్ధి చెప్తాము. అధికార బలగాన్ని అడ్డుపెట్టుకొని టిడిపి నేతల పోరును ఆపలేరు,” అని ట్వీట్ చేస్తూ పామర్రులో పోలీసులు తమతో ఏవిదంగా దురుసుగా ప్రవర్తించారో వీడియోను కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…