
తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి హడలిపోయిన వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటనే తన సిట్టింగ్ ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేస్తుండటంపై మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమ చాలా వ్యంగ్యంగా స్పందించారు. అది చూస్తే జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపి నేతలందరూ కూడా నవ్వాపుకోలేరు. అంత అద్భుతంగా ఉంది.
రాష్ట్రంలో మునిసిపల్ సిబ్బంది వాహనాలు వేసుకొని ఇంటింటికీ వెళ్ళి తడిచెత్త, పొడిచెత్తను సేకరిస్తుంటారు. దానినే దేవినేని ఉపయోగించుకొంటూ ఓ కార్టూన్ జోడించారు. ఆ మునిసిపల్ వాహనాన్ని నడుపుతున్న ఎంపీ విజయ సాయిరెడ్డి, పైన ఎమ్మెల్యేలను వేరుచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి, “అల్లుడూ చెత్త చెత్తే… ఎటువేసినా ఒకటే” అని సలహా ఇస్తున్నట్లు కార్టూన్‌లో చూపారు.
“చెత్త ఎటు వేసినా చెత్తే.. ఒక చోట అసమర్ధులు, ఓడిపోతారు అని తెలిసిన క్యాండిడేట్స్ ని వేరొక చోటకు మార్చినంత మాత్రాన సమర్థులు ఎలా అవుతారు?జగన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు అని అనుకోకండి. ఉల్లిగడ్డ అంటే పొటాటో అనే వ్యక్తి ఆలోచనా పరిధి అలాగే ఉంటుంది,” అంటూ దేవినేని వ్యంగ్యంగా తన కామెంట్స్ జోడించారు.
నిజమే కదా? నాలుగున్నరేళ్ళుగా ఓ నియోజకవర్గంలో రాణించలేని ఎమ్మెల్యే, మిగిలిన ఈ మూడు నెలల్లో వేరే నియోజకవర్గంలో ఎలా రాణించగలరు?అయినా జగన్ తీసుకొనే నిర్ణయాలకు ఎమ్మెల్యేలు బాధ్యులను చేయడం దేనికి?
ప్రజలు తనను, తన పాలనను చూసే ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తారని, ఏపీకి జగనే ఎందుకు కావాలో చెప్పుకొంటునప్పుడు, మద్యలో ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం దేనికి?
చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనే నిర్ణయం కూడా జగన్ సొంత నిర్ణయమే కదా?దాని వలన ఎన్నికలలో వైసీపి ఓడిపోతే జగన్ బాధ్యత వహిస్తారా? లేక అప్పుడు కూడా వారి వలననే వైసీపి ఓడిపోయిందని వారినే నిందిస్తారా?
తమ అధినేత నిర్ణయంపై వైసీపి ఎమ్మెల్యేలు ఎవరూ ఇప్పుడు మాట్లాడనప్పటికీ టిడిపి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొంది. ఓ వైపు అధినేత పొగబెడుతుంటే మరోపక్క టిడిపి నేతలు ఈవిదంగా పొలిటికల్ ర్యాగింగ్ చేస్తుండటంతో “ఇక ఆపండి మహాప్రభో తట్టుకోలేకపోతున్నాము” అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తోంది.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…