Telugu

ఇదిప్పుడు నీట్ మాత్రమే కాదు.. కాంగ్రెస్‌, బిజేపిల బల పరీక్ష!

నీట్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేఐ) అధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, కాంగ్రెస్‌, మిత్రపక్షాలు యావత్ దేశం వ్యాపింపజేయడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురైంది.

కనుక ఓ పక్క సీజేఐ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు సాగిస్తుంటే, మరోపక్క కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పరీక్షా పత్రాల లీక్ చేసినవారికి మరింత కటినమైన శిక్షలు, జరిమానాలు విధించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ADVERTISEMENT

అలాగే ఈ సమస్యకు మూలకారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీలో 47 మందిపై వేటు వేసి సమూల ప్రక్షాళన మొదలుపెట్టింది.

అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే సీజేఐ డిమాండ్‌కి తలొగ్గితే మోడీ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బగా పరిగణింపబడుతుంది. విద్యార్ధులకు అండగా నిలబడి పోరాడినందుకు కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా మైలేజ్ లభిస్తుంది. మోడీ ప్రభుత్వంపై పైచేయి సాధించినట్లవుతుంది.

ప్రధాన్ చేత రాజీనామా చేయించగలిగితే మోడీ కంచుకోటని ఏవిధంగా పగులగొట్టాలో కాంగ్రెస్‌ పార్టీకి అర్ధమవుతుంది. కనుక రేపు మరో అంశంతో ఇదేవిధంగా ఆందోళనలు జరిపించి మోడీ ప్రభుత్వాన్ని దేశ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఈసారి మరో కేంద్ర మంత్రిని లేదా ప్రధాని మోడీ రాజీనామాకు పట్టుబట్టవచ్చు.

అలాగని ప్రధాన్ రాజీనామా డిమాండ్ తిరస్కరిస్తే, సీజేఐ ఆందోళనలు ఉదృతం చేస్తుంది. ఈ ఉద్యమం వీలైనంత త్వరగా చల్లారిపోతే మంచిదని మోడీ ప్రభుత్వం భావిస్తుంటే, వీలైనంత ఎక్కువ కాలం కొనసాగాలని కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు కోరుకోవడం సహజం. కనుక ఒకవేళ సీజేఐ ఈ ఆందోళనలు విరమించాలనుకున్నా కాంగ్రెస్‌, మిత్ర పక్షాలు దానిని విరమించనీయవు.

కనుక ప్రధాన్ రాజీనామా కేవలం విద్యార్ధులు, సీజేఐకి మాత్రమే పరిమితం కాదు. కాంగ్రెస్‌-బిజేపిలకు ఇంకా కీలకం. వాటిలో రాజకీయంగా ఏది పైచేయి సాధిస్తుందనే దానికి ప్రధాన్ రాజీనామా అంశం తేల్చబోతోంది.

కానీ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందు ఈ సమస్య నుంచి బయటపడి, తర్వాత కాంగ్రెస్‌ భరతం పట్టాలనుకుంటే, ప్రధాన్ చేత రాజీనామా చేయించవచ్చు. కానీ ఆయన రాజీనామాతో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త కొమ్ములు మొలిపించడం ప్రమాదమని భావిస్తే ఈ సమస్యని వేరేలా డీల్ చేసే అవకాశం ఉంది. మోడీ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకోబోతోందో మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varanasi Promotions Have a Secret Nobody Is Talking About

The Varanasi promotions are starting to feel like a controlled game. Only Rajamouli, Priyanka Chopra…

26 minutes ago

Drishyam 3 Trade Reports: 400 Cr Blockbuster or Just PR?

Drishyam: The Conclusion is creating a lot of buzz with a few more days left…

57 minutes ago