Telugu

“ధృవ” ట్రైలర్ టాక్ – చెర్రీ లుక్… బ్యాక్ గ్రౌండ్ కిక్..!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రామ్ చరణ్ “ధృవ” ధియేటిరికల్ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటివరకు ప్రేక్షకులకు కనిపించిన లుక్ లతో పోలిస్తే… ‘ధృవ’తో ది బెస్ట్ లుక్ లో చెర్రీ రాబోతున్నాడన్న సంకేతాలను ట్రైలర్ స్పష్టం చేసేసింది. ముఖ్యంగా పోలీస్ డ్రెస్ లో నడిచి వస్తున్న రామ్ చరణ్ స్టిల్ అభిమానుల చేత విజిల్స్ వేయిస్తుంది. అలాగే బీచ్ పక్కన గానీ, బాడీ బిల్డ్ చేస్తూ గానీ… ఇలా ఏ రకంగా చూసుకున్నా… చెర్రీ లుక్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేయడం మాత్రం ఖాయం.

ఇక, సినిమాలో ‘కంటెంట్’ ఏంటన్నది ఈ ‘ట్రైలర్’ ద్వారా చిత్ర యూనిట్ మొత్తం రివీల్ చేసేసింది. తెలివైన పోలీస్ ఆఫీసర్ కు మరియు అంతే తెలివి, డబ్బు గల ఒక బిజినెస్ మ్యాన్ కు మధ్య జరగబోయే ఆసక్తికరమైన ‘ఫైట్’ ఈ సినిమా కధగా చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ‘మైండ్ గేమ్’ సినిమాలు ఇప్పటికే టాలీవుడ్ లో వచ్చినప్పటికీ, రామ్ చరణ్ – అరవింద్ స్వామిల కాంభినేషన్ కాస్త ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చింది. అయితే ఒరిజినల్ ‘తనిఒరువన్’ చూసిన ప్రేక్షకులను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది వేచిచూడాల్సిన విషయం.

ADVERTISEMENT

రామ్ చరణ్ లుక్స్ కాకుండా ట్రైలర్ లో మరో ప్రధాన హైలైట్ హిప్ హాప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం. ట్రైలర్ ఈ స్థాయిలో మెగా అభిమానులను అలరించేలా ఉంది అంటే దానికి ప్రధాన కారణం బ్యాక్ గ్రౌండ్ సంగీతమే. పాటలతో నిరుత్సాహ పరిచినప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రశంసలు అందుకునే విధంగా హిప్ హాప్ అందించారు. ఇక, మిగతా పాత్రలన్నీ ప్రేక్షకులకు పరిచయం చేసారు గానీ, ట్రైలర్ మొత్తం చెర్రీ చుట్టూనే తిరిగేలా కట్ చేసి ఫ్యాన్స్ ను ఒక విధంగా బుట్టలో పడేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో డిసెంబర్ 9వ తేదీ కోసం వేచిచూడడం మెగా ఫ్యాన్స్ వంతు..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జగన్ పాదయాత్ర వైసీపీ కి ‘సంజీవని’ కానుందా.?

వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…

1 minute ago

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా రివ్యూ: దేవకన్యలు సైతం కాపాడలేకపోయారు!

చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…

10 minutes ago