
ఒక దశాబ్ద కాలం ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ ముట్టుకున్నదల్లా బంగారం అయింది అనటంలో సంకోచమే లేదు. బుమ్రా, పాండ్య బ్రదర్స్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హర్భజన్ మరియు తిలక్ వర్మ ల విషయంలో కూడా ముంబై కు ఇదే జరగటం మనం చూస్తూనే వచ్చాం.
కానీ, ఇన్ని అద్భుతమైన నైపుణ్యాలతో ముంబై కు చిరకాలం గుర్తుండిపోయే ఆటగాళ్లు ఇద్దరే, జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్య..! ఇంతమంది మహా-మహులలో ముంబై ఎంపిక చేసిన అత్యుత్తమ నైపుణ్యం వీరే. వీరిద్దరి సేవలు ముంబై జట్టు సుమారు 6-7 ఏళ్ళు పూర్తిగా అందుకున్నారు.
కానీ, 2022 లో గుజరాత్ మరియు లక్నో వంటి రెండు కొత్త జట్లు ఐపీఎల్ లో కి ఎంట్రీ ఇవ్వటం, అదే సమయానికి మెగా ఆక్షన్ ఉండటం వలన జట్లన్నీ తమ మెయిన్ ప్లేయర్స్ ను కూడా వదలక తప్పలేదు. అలా వదిలిన కోణంలో హార్దిక్ పాండ్య ను గుజరాత్ యజమాన్యం ఆక్షన్ కు ముందే దక్కించుకున్నారు.
ఇది అటు గుజరాత్ జట్టు కు, మరియు పాండ్య కు ఒక మాస్టర్ మూవ్ లా పని చేసింది. కెప్టెన్ గా గుజరాత్ లో కి అడుగుపెట్టిన మొదటి సీజన్లోనే జట్టును ఫైనల్ కు పట్టుకెళ్లటమే కాకుండా, ఏకంగా ట్రోఫీ ను అందించి చరిత్ర పుస్తకాలకెక్కాడు కెప్టెన్ పాండ్య.
ఆ తదుపరి సీజన్ ఐపీఎల్-2023 లో కూడా అదే అమోఘమైన ఫామ్ ను కొనసాగిస్తూ ఫైనల్ వరుకు తీసుకెళ్లాడు పాండ్య. ఫైనల్ లో జడేజా మెరుపుల వల్ల ట్రోఫీ చేజార్చుకున్నప్పటికీ, టీం ఇండియా కెప్టెన్సీ అనే పదవిని గెలుచుకున్నాడు పాండ్య.
అదే సమయంలో తన ఎక్స్-ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ తనను మళ్ళీ కలిసింది. టీం ఇండియా కెప్టెన్సీ పాండ్య చేతికి రాగానే పాండ్య ను మళ్ళీ ముంబై జట్టు లో కి తీసుకువచ్చారు ముంబై ఇండియన్స్. కానీ, అప్పటికే ఆ జట్టులో రోహిత్, సూర్య, బుమ్రా వంటి అగ్ర ఆటగాళ్లు ఉన్నారు.
వీరందరితో పాండ్య కలయిక అపోజిషన్ జట్లకు గుండెలో రైళ్లు పరిగెత్తాల్సిందే అనుకున్నారు అందరు. కానీ, ముంబై జట్టు కేవలం ఆన్-పేపర్ బలంగా ఉండటం వలన ట్రోఫీలు గెలవలేం అని నిరూపించారు. 2024 లో ఘోరమైన పెర్ఫామెన్స్ తో టేబుల్ లో చివరి స్థానానికి అంకితమైంది ఆ జట్టు.
2025 లో కం-బ్యాక్ చేసినట్టే కనిపించినప్పటికీ, క్వాలిఫయర్-2 లో పంజాబ్ చేత ఓటమి చెంది లీగ్ నుండి బహిష్కరింపబడ్డారు. కానీ, 2026 కోసం వింటేజ్ జట్టును మళ్ళీ తీసుకురావడంతో ముంబై ఫేట్ చేంజ్ అవుతుంది అనుకుని ఉంటారు యాజమాన్యం మరియు ఫాన్స్.
కానీ, ఈ సీజన్ ముంబై కలలో కూడా ఊహించని రిజల్ట్స్ చవిచూస్తున్నారు. ఇప్పటికే ప్లే-ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించబడ్డారు ముంబై ఇండియన్స్. కేవలం ఓటములు కాకుండా, ఘోరమైన ఓటముల వలన పాండ్య పై నిరాధికార కెప్టెన్సీ వేటు పడిందంటూ ఫాన్స్ భావిస్తున్నారు.
ఇటు పాండ్య చూసుకున్నా, ముంబై లో రోహిత్, సూర్య మరియు తిలక్ వంటి వాళ్ళను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి అన్-ఫాలో అవ్వటం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ జట్టు నుండి పాండ్య కేవలం బుమ్రా మరియు నామం ధీర్ ల ను ఫాలో అవటం విశేషంగా మారింది. మరి పాండ్య తిరిగి ముంబై కి వచ్చి తప్పు చేశాడా..? మీరేం అనుకుంటున్నారు?
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…