‘ఆశ’ పడితే కాదు ‘కష్ట’ పడితే..!

ప్రజలిచ్చిన అధికారంతో వచ్చిన ముఖ్యమంత్రి హోదాను నిలబెట్టుకోవడం చేతకాక ప్రజలివ్వని ప్రతిపక్ష నేత హోదా కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్.

ADVERTISEMENT

అసెంబ్లీకి రావాలంటే నాకు హోదా ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని చూస్తుంటే బడికెళ్ళంటే చాక్లెట్ కావాల్సిందే అంటూ మారం చేసే చిన్నపిల్లాడు గుర్తు వస్తున్నాడు అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

ప్రజల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అసెంబ్లీలో ప్రజా గొంతు వినిపించడానికి, ప్రజల తరుపున పోరాటాలు చేయడానికి తనకు హోదా కావాల్సిందే అంటూ మారం చేస్తున్న జగన్ ఒక్కసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ను జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుంటుంది అంటున్నారు జనసైనికులు.

2014 లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ ఎన్నికలలో పోటీ చేయకుండా ఎన్డీయే కూటమికి మద్దతిచ్చి టీడీపీ ప్రభుత్వ ఏర్పాటులో బలమైన పాత్ర పోషించారు. తానూ మద్దతు తెలిపిన ప్రభుత్వమే అయినప్పటికీ ప్రజా అభిప్రాయానికి బద్ధుడై ఎన్డీయే ప్రభుత్వాన్ని సైతం ఎదిరించి ప్రజల తరుపున పోరాటాలు చేసారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆ తరువాత 2019 ఎన్నికలలో వామపక్షాలను కలుపుకుని పోటీ చేసిన జనసేన రాజోలు నియోజకవర్గంలో మాత్రమే గెలిచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. సాక్ష్యాత్తు పవన్ సైతం పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోవడం జనసేన ఉనికిని ప్రశ్నించింది. అయితే
జనసేన ఓడిపోయినా, పవన్ అవమానాలను ఎదుర్కున్న ఎక్కడ వెనకడుగు వెయ్యలేదు. ప్రజాపోరాటాలు ఆపలేదు.

జగన్ మాదిరి కుంటి సాకులు వెతుక్కుంటూ ప్రజలిచ్చిన తీర్పును వ్యతిరేకించలేదు. 2019 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కనీసం ఆయనను పేరు పెట్టి కూడా పిలవడానికి సుముఖత చూపలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, పెళ్లిళ్ల స్టార్ అంటూ అవహేళన చేస్తూ పవన్ ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టారు. అలాగే జనసైనికులను మానసికంగా కృంగతీసారు.

పవన్ పై జగన్ అండ్ కో చేస్తున్న వ్యక్తిగత దాడి మోతాదుకు మించి పోవడంతో సామాన్య ప్రజలలో సైతం జగన్ పట్ల ద్వేషం, పవన్ పట్ల సానుభూతి మొదలయ్యింది. అది చివరికి ఏ స్థాయికి వెళ్లిందంటే 2024 ఎన్నికలలో జనసేన పోటీ చేసిన 21 కి 21 నెగ్గి 100 %స్టైకింగ్ విక్టరీ సాధించి దేశ చరిత్రలోనే జనసేన తన పేరిట పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచిన ఏకైక రాజకీయ పార్టీగా రికార్డు సృష్టించగలిగింది.

ఈ ప్రయాణంలో ఎక్కడ పవన్ తనను ప్రభుత్వాలు అవమానిస్తున్నాయని కానీ, తన కుటుంబాన్ని కించపరుస్తున్నారని కానీ, తన స్టార్ స్టేటస్ కు తగిన గౌరవం దక్కడం లేదని కానీ, తన సినిమాలను ఆర్థికంగా దెబ్బ తీస్తున్నారని కానీ తన పోరాటాన్ని ఆపలేదు. తన పార్టీ ఓడినా, తనను ఓడించినా ఎన్నడూ ప్రజా క్షేత్రానికి దూరంగా వెళ్ళలేదు.

గత ఐదేళ్లు నియంతలా సాగిన జగన్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్రజలలో ఆత్మస్తైర్యాన్ని నింపారు. ఓడించారు, ఓడిపోయాను అనే సాకులు చెప్పి పారిపోలేదు. అక్కడే నిలబడ్డాడు, ప్రభుత్వానితో తలబడాడ్డు, రాష్ట్రం కోసం తగ్గాడు, చివరికి నెగ్గాడు. ప్రజలివ్వని పదవి కోసం ఆశపడలేదు, ప్రభుత్వాలు గుర్తించని హోదా కోసం పోరాటం చెయ్యలేదు. కష్టపడ్డారు…సాధించుకున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

3 hours ago

After Vijay, Will Nayanthara Enter Tamil Nadu Politics?

Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…

3 hours ago