దిల్ రాజు ముందే పసిగట్టారు!

dil-raju-fetches-96-movie-dil-raju-rightsనేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి – త్రిషల “96” సినిమాకు సినీ విమర్శకులు బ్రహ్మరధం పట్టారు. విశ్లేషకుల నుండి మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు, ప్రేక్షకుల నుండి కూడా అదే స్పందన లభిస్తోంది. దీంతో విజయ్ అండ్ త్రిషల కెరీర్ లలో మరో హిట్ మూవీగా “96” నిలవబోతోంది.

[m9ad]

ADVERTISEMENT

కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే, ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం. బహుశా ఈ అంశాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందుగానే గ్రహించినట్లున్నారు, అందుకే ఈ సినిమా విడుదలకు ముందే తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా అధికారిక ప్రకటన చేసి మరీ స్పష్టత ఇచ్చారు.

విడుదలైన తర్వాత అయిన సక్సెస్ రేటును బట్టి, వచ్చిన పేరుప్రఖ్యాతలను బట్టి సినిమా యొక్క రీమేక్ హక్కుల ధరలు మారిపోతుంటాయి. ఒకవేళ సినిమా సక్సెస్ కాకపోతే తగ్గిపోతూ కూడా ఉంటాయి. కానీ “96” ట్రైలర్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారో ఏమో గానీ, దిల్ రాజు మంచి సినిమానే పట్టేసారన్న టాక్ టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories