నాగశౌర్య చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్స్ కు, కుటుంబ కథలకు సరిగ్గా సరిపోతాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి అటువంటి కథలే చేశాడు. అయితే ఒక హిట్ రెండు ప్లాపులు అన్నట్టుగా సాగింది అతని కెరీర్. ఈ తరుణంలో ఏమైందో ఏమో గాని యాక్షన్ సినిమాల వైపు మొగ్గు చూపాడు శౌర్య.
ఈ తరుణంలో అశ్వథామ అనే సినిమా ట్రై చేశాడు. దానికి స్టోరీ రైటర్ గా కూడా అవతారం ఎత్తాడు. అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. అయినా నాగశౌర్యకి తత్వం బోధపడలేదు. ఆయన శుక్రవారం నాడు మరో యాక్షన్ ఎంటర్టైనర్ కు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు మహేష్ ఎస్. కోనేరు నిర్మాత. కె.పి.రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కళ్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం హీరో కళ్యాణ్ రామ్ స్క్రిప్ట్‌ను దర్శకుడు కె.పి.రాజేంద్రకి అందజేశారు. సహజంగా కొందరు హీరో కొన్ని రకాల కథలకు మాత్రమే సూట్ అవుతారు.
యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు అంతా సూట్ కారు. ఆ విషయం నాగశౌర్య తెలుసుకుంటే ఆయనకే మంచిది. ఇది ఇలా ఉండగా ఈ మధ్యనే శౌర్య సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమా ఎటువంటిదో తెలియాల్సి ఉంది. ఇది కాక అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంకో సినిమా కూడా సెట్స్ మీద ఉంది.






