
ఈ సందర్భంగా తాను నలుగురు వ్యక్తుల గురించి మాట్లాడుతానని… తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గాయత్రి గుప్తాల గురించి మాట్లాడతానని చెప్పాడు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఒప్పుకుంటే… ఆమెను పెట్టి ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
సీనియర్ నటి అయిన ఎమ్మెల్యే రోజాకు పాదాభివందనమని, ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడే రోజా… సినిమా పరిశ్రమలోని సమస్యల గురించి మాత్రం మాట్లాడదని మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు, టెక్నీషియన్లు ఇలా ఎందరో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా ఆమె ఏమీ చేయడం లేదని విమర్శించాడు.
రామ్ గోపాల్ వర్మ విదేశీ నటిని పెట్టి సినిమా తీశారని… రోజాను పెట్టి తీసుంటే బాగుండేదని అన్నాడు. ఇప్పటికైనా పోయేదేమీ లేదని, రోజా ఒప్పుకుంటే ఆమెను పెట్టి నేను ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 2’ సినిమా తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలకు తెరలేపాడు. బహుశా దీనిపై మరికొద్ది గంటల్లో వచ్చే దుమారం అంచనాలకు అందదేమో!
సినీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చేస్తుంటే… సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని అజయ్ మండిపడ్డారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వానికి సినీరంగం 600 కోట్ల ట్యాక్స్ కట్టిందని… కానీ, కేసీఆర్ అనౌన్స్ చేసిన ఏ ఒక్క పనీ అమలుకు నోచుకోలేదని అన్నాడు.
ఈ సమస్యను తలసాని దృష్టికి తీసుకెళ్లే… యూసుఫ్ గూడ చెక్ పోస్టు వద్ద ఉన్న చిన్న శ్రీశైలం యాదన్ కలవమని మాకు సలహా ఇచ్చాడని… మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడా అని ప్రశ్నించాడు. ఇక పవర్ స్టార్ వపన్ కల్యాణ్ పై కూడా కౌండిన్య మండిపడ్డాడు. ఎన్నో సమస్యలపై ప్రశ్నించే పవన్… సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించరా అని నిలదీశారు.
కేసీఆర్ కు క్షమాపణలు చెప్పుకోవడానికే ఆయన ఇంటికి పవన్ వెళ్లారని చెప్పాడు. పవన్ అంటే తనకు వ్యక్తిగతంగా ఇష్టమని, ఈయనతో సినిమా తీయడానికి ఆస్ట్రేలియాలో 100 కోట్ల పెట్టి ఓ నిర్మాతను పట్టుకున్నాను, కానీ ఈయనేమో సినిమాలకు దూరమవుతున్నారు. కళాకారుల సమస్యలను పవన్ పట్టించుకోవాలని కాస్త గట్టిగానే చెప్పుకొచ్చారు.
ఒక ఆడ, మగా తేడా తెలియని ఓ అమ్మాయి గురించి మాట్లాడతానని… ఆమె గాయత్రి గుప్తాఅని కౌండిన్య తెలిపారు. సినీపరిశ్రమలో అమ్మాయిలను నిర్మాత, దర్శకులు వాడుకుంటారని ఆమె ఓ టీవీలో మాట్లాడుతూ చెప్పిందని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో జరిగేది ఏందో తెలిసి కూడా ఇలాంటి విషయాలు మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…
Maremma starring Maadhav has created good buzz with the glimpse, teaser and songs. The story…