
తన సినిమాలలో పదునైన పదాలతో ప్రేక్షకులను కట్టిపడేసే క్రిష్, తన పెళ్లి శుభలేఖలో కూడా అంతే స్థాయిలో అక్షర ఆయుధాన్ని చూపించాడు. ఒక వివాహానికి ఇలా కూడా ఆహ్వానం పంపవచ్చా… అనే రీతిలో ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ శుభలేఖను రూపొందించడం వీక్షకులను మరింత కట్టిపడేస్తోంది. దీని ఫార్మాట్ ఒక ఆహ్వాన పత్రిక కంటే కూడా ఒక ‘లెటర్’ మాదిరి తయారు చేయడం క్రిష్ శైలికి అద్దం పడుతోంది.
విచ్చేసే అతిధులే దైవాలుగా వర్ణించిన ఈ లేఖలో తనకు నక్షత్రాలు, రాశుల యందు ఎంత నమ్మకం ఉందో కూడా చాటిచెప్పాడు. ఆగష్టు 7వ తేదీన గోల్కొండ రిసార్ట్ లో క్రిష్ ఆహ్వానం పలికిన దైవాల మధ్య వివాహ వేడుక అద్భుతంగా జరిగి… ఈ ‘గమ్యం’ దర్శకుడి జీవితం నిజంగానే ‘రమ్య’మనోహరంగా సాగాలని ఆశిద్దాం.
The NDA government that is currently in power in Andhra Pradesh is doing a solid…
వినియోగదారుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.…