లొక్డౌన్ కారణంగా దేశం మొత్తం తమ తమ ఇళ్లకే పరిమితం అయిపోయింది. మాములుగా బిజీగా ఉండే మగవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోవడంతో… కొందరు తమ సతీమణులకు హెల్ప్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్, సందీప్ వంగా భారత దేశపు మోస్టు పాపులర్ డైరెక్టర్, ఎస్.ఎస్. రాజమౌళికి ఒక స్పెషల్ ఛాలెంజ్ విసిరారు.
లాక్డౌన్ కాలంలో అతను ఇంటి పనులను చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ, ఎస్ఎస్ రాజమౌళికి ‘#BetheREALMAN’ ఛాలెంజ్ విసిరాడు. ఇళ్లలోని మహిళలకు సహాయం చేయడానికి ప్రజలను చైతన్యపరిచే విధంగా ఇంటి పనులను చేయాలని, ఇలాంటి వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలని ఆయన దర్శకుడిని కోరారు. రాజమౌళి ఈ సవాలును స్వీకరించి, రేపు వీడియోను పోస్ట్ చెయ్యనున్నట్టు ప్రకటించారు.
మనలో ప్రతి ఒక్కరి లాగే లాక్‌డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు బ్రేక్ రావడంతో రాజమౌళి కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్‌గా ప్లాన్ చేశారు. లాక్డౌన్ బ్రేక్ కారణంగా ఈ చిత్రం సమ్మర్ 2021 కు వాయిదా పడుతుందని పుకార్లు ఉన్నాయి.
ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ – అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ ఆధారంగా తీస్తున్న కల్పిత కథ ఆర్ఆర్ఆర్. వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/imvangasandeep/status/1251771998834851840





