
అయితే ఎన్ని హిట్టు, ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా… తనదైన శైలిలో వెళ్ళడమే తేజ స్పెషాలిటీ. అందులో భాగంగానే తన తాజా సినిమాకు “నేనే రాజు… నేనే మంత్రి…” అన్న టైటిల్ ను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ టైటిల్ తేజ సినిమా కంటే, తేజకు ఎక్కువగా సూట్ అవుతుందని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే…
గతంలో మాదిరి కొత్త వారిని ఎంపిక చేసుకుని పప్పులో కాలేయకుండా, ప్రేక్షకులకు బాగా పరిచయమైన వారిని తన సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి తర్వాత అంతటి పేరును కొట్టేసిన రానా హీరోగా, తను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారని సమాచారం. ఈ సినిమాను తేజ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా అయినా మళ్ళీ ‘సక్సెస్’ రుచిచూస్తారో లేదో చూడాలి.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…
With just a day left for the Andhra Pradesh municipal elections, the scale of security…