
నేడు మహిళా దినోత్సవం సందర్భంగా దివ్వెల మాధురి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి, వారికి ఓ సందేశం ఇచ్చారు. “మహిళలు ముఖ్యంగా మూడు విషయాలపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం, ఆర్ధిక స్వాతంత్ర్యం, మనోధైర్యం. ఈ మూడు ఉంటేనే మహిళలు రాణించగలరు. నా విషయంలో రోజూ మీడియాలో ఎంత చర్చ జరుగుతుందో, ఎన్ని వార్తలు వస్తుంటాయో అందరికీ తెలుసు. నేను వాటన్నిటినీ పట్టించుకోకుండా నా పనేదో నేను చేసుకుపోతాను. ఇంత మనోధైర్యం లేకపోతే ఈ సమాజంలో బ్రతకలేము.
తిరుపతిలో జాన్వీ కపూర్ కేక్ కట్ చేశారు. అంతకు ముందు చాలా మంది కేక్ కట్ చేశారు. కానీ అప్పుడు ఎవరికీ అది తప్పుగా అనిపించలేదు. కానీ నేను కేక్ కట్ చేస్తేనే తప్పుగా కనిపించింది. ఇది నేను సృష్టించిన వివాదం కాదు. మీడియా వాళ్ళే ఇలాంటి వార్తలు వ్రాసి నన్ను వివాదాలలోకి లాగే ప్రయత్నం చేస్తుంటారు. నా వల్ల మీడియాకి వ్రాసుకునేందుకు మ్యాటర్ దొరుకుతోంది.. నా గురించి ఏదేదో చెప్పుకొని టిఆర్పీ పెంచుకుంటున్నారు. ఈవిధంగా కూడా నేను వారికి సాయపడుతున్నందుకు సంతోషిస్తున్నాను,” అని అన్నారు.
దివ్వెల మాధురిమహిళలు దృష్టి పెట్టాల్సిన విషయాల గురించి చెప్పినవి అక్షరాల నిజమే. ఆమె తన భర్తతో, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య, పిల్లలతో జీవితం గడుపుతుంటే ఎవరూ వారిని వేలెత్తి చూపగలిగేవారు కారు.
కానీ మహిళలకు ఇన్ని సందేశాలు ఇస్తున్న దివ్వెల మాధురీ తన భర్తని వదిలేసి, పరాయి స్త్రీ భర్తతో అనైతిక సంబంధం పెట్టుకున్నారు. సాటి మహిళ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసి మహిళా దినోత్సవం రోజున ఇలాంటి సందేశాలు ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…
The most anticipated trailer of Rajinikanth's Jailer 2 directed by Nelson Dilipkumar was released recently…