
భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన విశాఖ వాస్తవ్యుడు అంబటి రాయుడు ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పి రాజకీయంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైసీపీ అనే పిచ్ రెడీ చేసినట్టున్నారు.గతంలో తాడేపల్లి పాలస్ కు వచ్చి ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన రాయుడు వైసీపీ ప్రభుత్వం పై కూడా ప్రశంసలు కురిపించారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఇక రాజకీయం అనే గ్రౌండ్ లో వైసీపీ అనే పార్టీ పిచ్ మీద ప్రాక్టీస్ కి సిద్దమయినట్టున్నారు ఈ మాజీ క్రికెటర్.తాజాగా తెనాలిలో పర్యటించిన అంబటి రాయుడు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించే మధ్యాహన భోజనం ఆరగించి దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలను అందిస్తున్నారని, ప్రభుత్వం అందించే భోజనంలో కూడా నాణ్యత ఉందంటూ, సచివాలయ ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందంటూ జగన్ ప్రభుత్వానికి కితాబిచ్చారు.
అయితే న్యాయస్థానాలు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలేసిన సచివాలయ వ్యవస్థలను కూడా రాయుడు కొనియాడడం గమనార్హం. క్రికెట్ లో అంతగా రాణించలేని రాయుడు రాజకీయాలలో అయినా నిలదొక్కుకోగలరా అనేది సందేహమే. అందునా వైసీపీ పార్టీలో నాయకుడిగా ఎదగాలంటే మనిషిగా దిగజారిపోవాలని ఇప్పటికే పలువురు నేతలు రుజువుచేసిన క్రమంలో ఇప్పుడు రాయుడు ఆస్థాయికి దిగి వైసీపీ పార్టీలో నెగ్గుకురాగలరా?
జాతీయ జట్టులో ఆటగాడిగా రాష్ట్రమంతా గుర్తింపు ఉన్న రాయుడుని జగన్ నిర్ణయించిన రాజధాని విశాఖ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దింపడానికి చర్చలు జరుగుతున్నట్టు మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.ప్రతి ఐదేండ్లకొకసారి విశాఖ పార్టీ అభ్యర్థిని మార్చే ఆనవాయితీ ఉన్న జగన్ 2014 ఎన్నికలలో తన తల్లి విజయ లక్ష్మిని రంగంలోకి దింపి బంగపడ్డారు. విశాఖ ప్రజలు ఇచ్చిన షాక్ తో 2019 లో ఎంవివి.సత్యనారాయణను బరిలో ఉంచి విజయం సాధించారు.
2024 లో రాష్ట్రంలో జరిగే ఎన్నికల ఆటకు ఈసారి రాయుడికి అవకాశం ఇచ్చే ఉద్దేశంలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగానే హామీ దక్కడంతోనే రాయుడు వైసీపీ ప్రభుత్వం పై అక్కర్లేని ప్రశంసలు కురిపిస్తున్నారని కొందరు, వైసీపీ టికెట్ ఆశించే జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి అంబటి ఇప్పటి నుండే నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారని మరికొందరు రాయుడి పై ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టిన జగన్ కు ఇటువంటి వారి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ టీమ్ కి ఇండియా ఫాన్స్ సపోర్ట్ చేసినంత పాపం అవుతుంది అంటూ తన క్రీడా బాషలోనే బదులిస్తున్నారు ఆయన అభిమానులు.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, is gearing up for a…
Nana Patekar passed away in Goa on October 8 at the age of 75 due…