ఇంతకీ కాంగ్రెస్ రాజధాని ఎక్కడా..?

ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఏస్థాయికి దిగజారింది అంటే ఏపీ రాజధాని అనుకోవాల్సి పరిస్థితి నుండి వైసీపీ రాజధాని, టీడీపీ రాజధాని , కాంగ్రెస్ రాజధాని…అంటూ ఇలా పార్టీల పేరుతో రాజధానులను ఎంచుకోవాల్సి వస్తుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అమరావతి తిరిగి రాజధానిగా పునరుద్ధరిస్తాం అంటూ ఆ కూటమి సభ్యులు హామీ ఇస్తుంటే..,ఈసారి మరో అవకాశం ఇస్తే విశాఖే రాజధాని అంటూ వైసీపీ ముందుకొస్తుంది.

అయితే మీ రాజకీయ పోటీలో నేను ఉన్నాను అంటూ అడుగేసిన కాంగ్రెస్ పార్టీ తానూ అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిని ఎక్కడ నిర్మిస్తారో ఇప్పటికి చెప్పలేదు. ఎప్పుడో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పేరుని, రాజకీయ పార్టీలు అన్ని కలిపి చంపేసిన ప్రత్యేక హోదాని అడ్డుపెట్టుకుని ఏపీలో తన రాజకీయ అడుగులు వేస్తున్న షర్మిల అన్న సమాధి చేసిన ఏపీ రాజధాని అమరావతిని బతికిస్తారా..? లేక అన్న ఎంచుకున్న రాజధానికే ఓటేస్తారా..?

ADVERTISEMENT

ఇవేమి కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరో కొత్త ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తారా..? అనేదాని పై షర్మిల ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చెయ్యాలి. ఇప్పటికే అమరావతి, విశాఖ, కర్నూల్, హైద్రాబాద్ అంటూ ప్రజలను కన్ ఫ్యూజ్ చేస్తూ రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటూ వారి రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్న వైసీపీ, ప్రభుత్వం మారగానే రాజధానిని మార్చేయాలి అన్నట్టుగా అధికారంలోకి వచ్చి రాగానే రాజధాని మార్పు పై ప్రకటన చేసి అమరావతి రైతుల త్యాగాలను సమాదులతో పోల్చారు.

మాట తప్పను మడం తిప్పను అంటూ ప్రగల్బాలు పలికే పెద్దమనుషులు అధికారం అందగానే ఎలా మాట తప్పారో..ఎలా మడం తిప్పారో చూసిన ఏపీ ప్రజలు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను, రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలను నమ్మే పరిస్థితులలో లేరనే చెప్పాలి. అసలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఏపీ రాష్ట్రాన్ని ఒక అనాధగా రాజకీయ పార్టీల నిర్ణయాలకు బలి చేసేసింది. ఇటువంటి తరుణంలో కేంద్రంలో అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్న రాహుల్ గత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వలన ఛిద్రమైన ఏపీని గాడిన పెట్టడానికి ఎం చేస్తారో చెప్పాలి.

అలాగే ఏపీకి జరిగిన, జరుగుతున్న ఈ అన్యాయానికి బాధ్యత తీసుకుంటూ ఏపీ ప్రజలకు కూడా క్షమాపణలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాలను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రజల మనోభావాలను గాలికొదిలి తీసుకున్న ఈ విభజన నిర్ణయంతో నష్టపోయింది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు కొన్ని తరాల భవిష్యత్తు. దీనికి సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యత, అవసరం రెండు కాంగ్రెస్ పెద్దల భుజాల పైన ఉందనేది గ్రహించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

30 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

33 minutes ago