రజినీ “జైలర్” ను బాలయ్య మిస్ చేసుకున్నాడా?

Balakrishna Jailer Movieసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. రజినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ జైలర్ లో డిఫరెంట్ గా కనిపించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. సాధారణంగా రజినీ సినిమా అంటే భారీ యాక్షన్ సీన్ లు…మాస్ డైలాగులు ఉంటాయి.

కానీ జైలర్ కథను బేస్ చేసుకుని రజినీ తండ్రి పాత్రలో కనిపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాంతో ఒక ఇండస్ట్రీలో స్టార్స్ అయినప్పటికీ ఇతర భాషల్లో మంచి రోల్ వస్తే నో చెప్పకుండా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో బాలీవుడ్ హీరో హీరో హీరోయిన్ లు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ADVERTISEMENT

కాగా జైలర్ లో డైరెక్టర్ నెల్సన్ టాలీవుడ్ స్టార్ బాలయ్య ను తీసుకోవాలని అనుకున్నారట. సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలయ్య ను తీసుకోవాలని అనుకున్నప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదని నెల్సన్ చెప్పాడు.

తమిళ్ దర్శకుడు నెల్సన్ బాలయ్య ని డీడ్లీ ఎటాకింగ్ కాప్ రోల్ లో అనుకున్నాడంట కానీ క్యారెక్టర్ సరిగ్గా రాకపోయేసరికి డ్రాప్ అయ్యాడని చెప్పడం తో జైలర్ చూసిన బాలయ్య ఫాన్స్ నీరస పడ్డారు. బాలయ్య కి కూడా పడుంటే చిన్న రోలే అయినా ఆ లెక్క వేరే ఉండేది. 

నెల్సన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో బాలయ్య నటించి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ ఉండేది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మళయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ లు కూడా గెస్ట్ రోల్స్ లో అదరగొడుతున్నారు. కాబట్టి బాలయ్య కూడా జైలర్ లో నటించి ఉంటే సినిమా కు మరింత హైప్ వచ్చేది.

ఇప్పటికే జైలర్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. మరోవైపు బాలయ్య కూడా వరుస హిట్ లతో ఫుల్ స్వింగ్ మీద ఉన్నాడు. కాబట్టి బాలయ్య జైలర్ లో నటించి ఉంటే ఈ సినిమా కు టాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ వచ్చేది. కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ వచ్చేవి.

ADVERTISEMENT
Latest Stories