
గత తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగడంతో కేసీఆర్ ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారు అంటూ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి మొత్తానికి అనుకున్నది సాధించుకున్నారు.
అక్కడితో ఆగకుండా మా తెలంగాణలో మీ రాజకీయమేమిటి అంటూ టీడీపీ పార్టీని విమర్శించిన కేసీఆర్ చంద్రబాబుకి త్వరలోనే మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అంటూ చెప్పి తెర వెనుక జగన్ మోహన్ రెడ్డి గెలుపు కోసం చేయాల్సిన రాజకీయమంతా చేసి ప్రస్తుత ఏపీ పరిస్థితికి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒక కారణంగా మిగిలారు. అప్పటి నుంచి కూడా జగన్ – కేసీఆర్ లు తెర చాటు రాజకీయ చేస్తూనే రెండు రాష్ట్రాల ప్రజలను తమ రాజకీయ క్రీడలో పాములుగా వాడుకుంటున్నారు.
తాజాగా కూడా తెలంగాణ పోలింగ్ రోజు నాగార్జున సాగర్ డాం దగ్గర ఆంధ్రా పోలీసుల హడావుడి చూస్తుంటే ఆటలో లాస్ట్ బాల్ కూడా సిక్స్ కొట్టి ముగించాలని అన్నట్లుగా ప్రజలలో సెటిమెంట్ ను పండించాలి అని చూసిన రెండు పార్టీలకు అది డాట్ బాల్ గానే మిగిలింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు గుట్టుగా లాక్కొస్తున్న వీరి ఇద్దరి బంధం అందరి ముందర బహిర్గతమయ్యింది.
అయితే తెలంగాణలో మారుతున్న రాజకీయ వాతావరణముతో కాంగ్రెస్ పార్టీ అధికార దిశగా అడుగులు వేస్తోంది అంటూ పలు సర్వేల రిపోర్ట్స్ బయటకు రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలలో జోరు పెరిగింది .అనుకున్నట్టే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరోక్షముగా కేసీఆర్ కు అండగా నిలబడిన జగన్ కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ వైసీపీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే వార్త పొలిటికల్,సర్కిల్స్ లో గట్టిగా వినపడుతుంది.
అలా జరిగితే అప్పుడు చంద్రబాబుకు ఎదురైన పరిస్థితే ఇప్పుడు జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానున్న కార్యం గంధర్వులు జరిపినట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల అంతిమ లక్ష్యానికి రేవంత్ కూడా తోడైతే ఇక ఏపీలో కూడా రాజకీయ వాతావరణం మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Virat Kohli and Rohit Sharma’s chances of playing in the 2027 ODI World Cup remain…
After the success of Animal, audiences are eagerly waiting to see what Sandeep Reddy Vanga…