
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయ పార్టీలలో గోడ మీద పిల్లి వాటం చూపించే నాయకులు చాలామందే ఉంటారు. ఇది రాజకీయాలలో ఒక ఆనవాయితీగా బలపడిపోయింది. ఈ మార్పులను ప్రోత్సహించడంలో ఏ పార్టీ అతీతం కాదనే చెప్పాలి.
ప్రతిపక్షములో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని అధికార పార్టీ పెట్టే ఆంక్షలను, వేధింపులను తట్టుకుని పార్టీకోసం నిలబడిన వ్యక్తులను కాదని పక్క పార్టీల నుండి వచ్చిన వలస పక్షులకు పెద్ద పీట వేయడానికి అన్ని రాజకీయ పార్టీలు ముందువరుసలోనే ఉంటాయి.
అయితే అధికార వైసీపీ ఫ్యాన్ గాలికి రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీయనున్నాయనే ఆలోచనతోనో లేక ఆ పార్టీలో తనకు అనుకున్న స్థానం దక్కలేదనే అక్కసుతోనే టీడీపీ సైకిల్ ఎక్కారు కొందరు వైసీపీ నేతలు. అలాగే ఏపీ ప్రజలు జగన్ కు మరో ఛాన్స్ ఇస్తారేమో అనే ఆశతో కొందరు టీడీపీ నేతలు ఫ్యాన్ కిందకు చేరారు.
అయితే టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో చేరిన నాయకులకు మాత్రం జగన్ వెంటనే ‘వైసీపీ వ్యాక్సిన్’ వేసేస్తున్నారో ఏమో కానీ పార్టీని వీడిన మరుక్షణం నుండే పార్టీ పైన పార్టీ అధినేత పైన ఆయన కుమారుడి మీద జుగుప్స కలిగే రీతిలో విమర్శలకు దిగుతున్నారు. విజయవాడ టీడీపీ ఎంపీ గా 2009 లో సైకిల్ ఎక్కిన కేశినేని నాని తాజాగా సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారు.
గడిచిన 15 ఏళ్ళ నుండి టీడీపీ పార్టీ తరుపున చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్లిన నానికి చంద్రబాబు నిజ స్వరూపం, లోకేష్ చేతకాని తనం ఇప్పుడే తెలిసిందా..? జగన్ ప్రభుత్వం బాబుని జైలుకి పంపినప్పుడు కూడా బాబు వెనుక నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన నానికి ఇప్పుడు జగన్ లో దేవుడు కనిపిస్తున్నాడా..? అంటూ మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు.
మోసానికి మారుపేరు చంద్రబాబు, బాబు ధనికుల పక్షపాతి,ఆయన కొడుకు ఒక పనికిమాలిన వాడు అంటూ జగన్ ప్రాపకం కోసం ఇన్నాళ్లు తనకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీని, పార్టీ పెద్దలను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు నాని. ఒక్క నాని మాత్రమే కాదు టీడీపీ పార్టీ నుండి వైసీపీ లో చేరిన ప్రతి నేతది ఇదే పరిస్థితి.
కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, విడుదల రజని ఇలా జగన్ నాయత్వంలో పని చేయడానికి సిద్ధపడిన ప్రతి నాయకుడు ఇలా రాజకీయ విలువలకు తిరోధకాలు ఇచ్చి రాజకీయంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులలో నీచమైన వ్యక్తిగత విమర్శలకు దిగి రాజకీయ విలువలను, నమ్మకాన్ని దిగజారుస్తున్నారు. ఇదే వైసీపీ డిఎన్ఏ అనేలా ఒక్కసారిగా రాజకీయ అపరిచుతులుగా మారిపోతున్నారు సదరు నేతలు.
కానీ వైసీపీ నుండి టీడీపీ కండువా కప్పుకున్న నేతలు ఎవరు జగన్ పై కానీ జగన్ కుటుంబం పై కానీ ఈ స్థాయి విమర్శలకు పాల్పడడం లేదు. తమ పార్టీలో చేరిన ప్రత్యర్థి పార్టీ నేతలతో ప్రత్యర్థుల పై ఇటువంటి రాజకీయాలు చేయడం చంద్రబాబు కి తెలియవా..? ఇలా సంస్కారాన్ని రోడ్డుకొదిలేసి నోటికి అడ్డుఅదుపు లేకుండా ప్రత్యర్థి పార్టీలను తిట్టించేంత విలువలు బాబుకు రావా..?
ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబుని ఇంత నీచంగా మాట్లాడిన నేతలు ఒక్క వైసీపీ పార్టీలో ఉండడం, దీనినే ఆ పార్టీ అధినేత విలువలతో కూడిన రాజకీయ అంటూ ప్రచారం చేసుకోవడం నిజంగా రాజకీయాలకే కాదు విలువలు అనే పదానికి కూడా కొత్త అర్దాన్ని నేర్పించాయి. ఇటువంటి రాజకీయాలను ప్రోత్సహించాడనికి ప్రజలు సిద్ధమా..? ఇటువంటి రాజకీయ నాయకులను బలపర్చడనికి ఓటర్లు సిద్ధమా..? ఒక్కసారి ఆలోచించాల్సిందే..!
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…